HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Why Isnt Revanth Giving 4000 Finchans To His Grandparents Kaushik Reddy

BRS MLA: అవ్వ తాతలకు రేవంత్ 4 వేల ఫించన్లు ఎందుకు ఇవ్వడం లేదు!

  • Author : Balu J Date : 23-06-2024 - 7:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Koushik Reddy
Koushik Reddy

BRS MLA: ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వ, తాతలకు పింఛన్లు రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పాడు.పింఛన్లపై ఆధారపడిన అవ్వ, తాతలకు మూడు నెలల నుంచి పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదు అవ్వ తాత ఉసురు నీకు తాకుతుంది

రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫ్లై యాష్ స్కాం లో మంత్రి పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకోలేదని అపోలో వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెబితే బహిరంగ క్షమాపణకు సిద్ధంగా ఉన్నానని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాల్ విసిరారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం 11 గంటలకు అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వస్తానని, మంత్రి పొన్నం కూడా అక్కడికి రావాలని ఫ్లై యాష్ స్కాం లో డబ్బులు తీసుకోకుంటే వచ్చి దేవుడు సాక్షిగా ప్రమాణం చేయాలని అన్నారు. ఒకవేళ బుధవారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రాకుంటే అదే సమయంలో మీడియా సాక్షిగా మరికొన్ని నిజాలు బయటపెడతానని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చెక్కులు పంపిణీ చేయకుండా అడ్డుకోవడం సరైంది కాదన్నారు. జీవో నెంబర్ (18 )2016 ప్రకారం చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే కే పూర్తి అధికారం ఉందని ఆయన అన్నారు. చెక్కుల పంపిణీ చేయాలని ఎమ్మార్వోలకు ఇప్పటికే సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ సమయం ఇవ్వాలంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హుజురాబాద్ కు వచ్చిన 381 చెక్కులను ఎందుకు పంచనివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోనని హుజురాబాద్ ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఆయన హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కి నాపైన ఏదైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోవాలి తప్పా ప్రజల మీద కాదన్నారు. ఈనెల 27 తారీకు వరకు చెక్కుల సమయం ముగుస్తున్నప్పటికీ ఎందుకు పంచడం లేదో చెప్పాలన్నారు. కలెక్టర్ నుంచి మొదలుకొని కిందిస్థాయి అధికారుల వరకు పద్ధతి ప్రకారం నడుచుకోవాలని లేనియెడల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులకు సంబంధించి బ్లాక్ బుక్కు ప్రిపేర్ చేశామని ప్రస్తుతం తప్పించుకున్నప్పటికీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MLA
  • cm revanth
  • hard comments

Related News

    Latest News

    • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

    • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

    • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

    • ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

    • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

    Trending News

      • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

      • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

      • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

      • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd