HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Who Is Conspiring Against Chiranjeevi

Chiranjeevi : చిరంజీవి పై కుట్ర పన్నేది ఎవరు..? జనసేన నేత సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆయన "పక్క రాష్ట్రం" లేదా "పొరుగు రాష్ట్రం" అని సంబోధించడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు

  • Author : Sudheer Date : 23-03-2026 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiranjeevi Speech Gaddar A
Chiranjeevi Speech Gaddar A

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆయన “పక్క రాష్ట్రం” లేదా “పొరుగు రాష్ట్రం” అని సంబోధించడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. చిరంజీవిపై జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారం వెనుక ఒక పథకం ప్రకారం సాగుతున్న రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. కేవలం యూట్యూబ్ లైకుల కోసం, వ్యక్తిగత లాభాల కోసం మెగాస్టార్‌ను టార్గెట్ చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు.

చిరంజీవి వ్యాఖ్యల్లోని అంతరార్థాన్ని వివరిస్తూ.. ఆయన ప్రస్తుతం తెలంగాణలో నివసిస్తున్నారు కాబట్టి ఏపీని పొరుగు రాష్ట్రం అనడంలో సాంకేతికంగా ఎలాంటి తప్పు లేదని వెంకటేశ్వరరావు సమర్థించారు. పైగా, ఏపీలో కూడా కళాకారులను ప్రోత్సహించాలని, అవార్డుల కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అత్యంత వినమ్రంగా కోరారని గుర్తుచేశారు. సినిమా రంగానికి అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు గారు ఈ దిశగా అడుగులు వేయాలని చిరంజీవి కోరడం ఆ రాష్ట్ర సినిమా అభివృద్ధి కోసమే తప్ప, విమర్శించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారు గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.

కూటమి ధర్మం మరియు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాము ప్రస్తుతం ఎంతో ఓపికగా ఉన్నామని, అయితే చిరంజీవి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టులు పెడితే సహించేది లేదని జనసేన నేత తేల్చి చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని, కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడితే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. “దురద పుడితే జాలీమ్ లోషన్ రాసుకోవాలి కానీ, చిరంజీవిపై పడి ఏడవద్దు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని, త్వరలోనే వారి అసలు రంగు బయటపడుతుందని ఆయన స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Chiranjeevi AP comments
  • Chiranjeevi Speech
  • conspiring against Chiranjeevi
  • gaddar awards
  • Jana Sena leader's sensational comments

Related News

Celebrities Congratulations To Vijay On TVK

Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించారు. విజయ్ ప్రజా సేవ చేస్తూనే ఉండాలని చిరంజీవి ఆకాంక్షించగా, ఈ విజయం ఒక సరికొత్త బెంచ్‌మార్క్ అని మహేష్ బాబు కొనియాడారు. రామ్ చరణ్, రవితేజ, సూర్య వంటి మరికొందరు హీరోలు కూడా విజయ్ విజన్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విజయ్ పట

  • Chandrababu Naidu At Bandla

    Bandla Ganesh : చంద్రబాబు సమక్షంలో బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థ వేడుక

Latest News

  • Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!

  • Petrol Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయం..!

  • Pithapuram వర్మపై టీడీపీ వేటు

  • TVK: విజయ్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన గవర్నర్

  • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

Trending News

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd