Samosa Caucus-Modi : సమోసా కాకస్ అని మోడీ చెప్పగానే.. అమెరికా ఎంపీల చప్పట్లు ఎందుకు ?
Samosa Caucus-Modi : సమోసా కాకస్ .. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఈ పదాన్ని వాడగానే.. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం చప్పట్లతో మార్మోగింది.ఇంతకీ సమోసా కాకస్ అంటే ఏమిటి ? అమెరికా కాంగ్రెస్ తో ఈ పదానికి ఉన్న సంబంధం ఏమిటి ?
- By Pasha Published Date - 02:12 PM, Fri - 23 June 23
Samosa Caucus-Modi : సమోసా కాకస్ ..
ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఈ పదాన్ని వాడగానే.. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం చప్పట్లతో మార్మోగింది.
ఇంతకీ సమోసా కాకస్ అంటే ఏమిటి ? అమెరికా కాంగ్రెస్ తో ఈ పదానికి ఉన్న సంబంధం ఏమిటి ?
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ సమోసా కాకస్ గురించి ప్రస్తావించారు. “సమోసా కాకస్ ఇప్పుడు.. అమెరికా కాంగ్రెస్ లో ఎంతో రుచికరమైనదిగా మారిందని నాకు తెలిసింది. రానురాను ఈ రుచి ఇంకా పెరుగుతుంది. సమోసా కాకస్ (Samosa Caucus-Modi) ఫ్యూచర్ లో అన్ని రకాల భారతీయ వంటకాలను, వాటి రుచులను ఇక్కడికి తీసుకొస్తుందని నేను ఆశిస్తున్నాను. గత రెండు శతాబ్దాలుగా మనం గొప్ప అమెరికన్లు, భారతీయుల జీవితాలతో ఒకరికొకరు స్ఫూర్తిని పంచుకున్నాం” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇలా మోడీ ప్రసంగం సాగుతుండగా.. అక్కడున్న ఎంపీలు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ నిలబడి చప్పట్లు కొట్టారు. కాగా, అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ అయిన మొదటి భారతీయ మహిళ కమలా హారిస్ అనే సంగతి మనకు తెలిసిందే.
Also read : Bike Chain Cleaning Tips: వర్షాకాలంలో మీ బైక్ చైన్ ను శుభ్రంగా ఉంచుకోండిలా..!
సమోసా కాకస్ అంటే ఏమిటి?
అమెరికా రాజకీయాల్లో ‘సమోసా కాకస్’ అనే పదం చాలా చర్చనీయాంశమైంది. 2016లో తొలిసారిగా ఐదుగురు భారత సంతతికి చెందిన ఎంపీలు అమెరికా పార్లమెంట్ కు ఎన్నికైన సమయంలో భారతీయ-అమెరికన్ లీడర్, అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఈ పదాన్ని తన ప్రసంగంలో ప్రయోగించారు. ‘సమోసా కాకస్’ అనే పదాన్ని సృష్టించింది ఆయనే. ఆ తర్వాతి నుంచి అమెరికా పార్లమెంటు లోపల భారత సంతతికి చెందిన ఎంపీల వర్గాన్ని ‘సమోసా కాకస్’ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రూపులో దాదాపు 5 నుంచి 6 మంది సభ్యులు ఉన్నారు. భారతీయ వంటకం సమోసా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ పదం అమెరికాలో భారతీయ మూలాలున్న వ్యక్తులకు పర్యాయపదంగా మారింది.
ఇప్పుడు సమోసా కాకస్‌లో ఎవరున్నారు ?
అమెరికా జనాభా దాదాపు 33 కోట్లు. ఇందులో ఒక శాతానికిపైగా భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు. మొత్తం 435 మంది సభ్యులున్న అమెరికా కాంగ్రెస్‌లో భారత సంతతికి చెందిన ఎంపీల సంఖ్య 5 మాత్రమే. ఇటీవల తానేదార్ అనే భారత సంతతి వ్యక్తి ఐదో ఎంపీగా ఎంట్రీ ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్ లో భారత సంతతికి చెందిన అమెరికన్ సభ్యుల సంఖ్య ఇంతటి స్థాయికి పెరగడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. మిచిగాన్ 13వ జిల్లాకు శ్రీ షామల్ తానేదార్ (68), కాలిఫోర్నియాలోని 6వ జిల్లాకు డాక్టర్ అమీ బెరా (58), కాలిఫోర్నియాలోని 17వ జిల్లాకు రో ఖన్నా (46), వాషింగ్టన్ లోని 7వ జిల్లాకు ప్రమీలా జయపాల్(57), ఇల్లినాయిస్ లోని 8వ జిల్లాకు రాజా కృష్ణమూర్తి (49) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అమెరికా కాంగ్రెస్ లో ఉన్న ఆరో సభ్యురాలు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్.
Related News
BJP Plan B: మ్యాజికల్ ఫిగర్ రాకపోతే బీజేపీ ప్లాన్ B ?
బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బీ ఏమిటి ? ఈ ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్లాన్ ఎ విజయవంతమయ్యే అవకాశం 60 శాతం మాత్రమే ఉందని మీరు భావించే పరిస్థితిలో ప్లాన్ బి రూపొందించబడింది. కానీ మా పరిస్థితి అలా లేదు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.