AP Results: ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటిస్తాం: ముఖేష్ కుమార్ మీనా
- Author : Balu J
Date : 02-06-2024 - 4:31 IST
Published By : Hashtagu Telugu Desk
AP Results: ఈ నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు , ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు.
ఈ నెల 8వ తేదీ లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం మరియు మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సీఈవో మీనా చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తోపాటు అదనపు సీఈఓ లు పి.కోటేశ్వరరావు, ఎమ్ ఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ సీఈఓ ఎస్. వెంకటేశ్వరరావు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.