Viral Video: వీడి ధైర్యానికి హ్యాట్సాఫ్…వైరల్ వీడియో..!!
మీరు హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణించాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను మాత్రం అస్సలు చూడకూడదు.
- By Hashtag U Published Date - 01:39 PM, Mon - 11 April 22
మీరు హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణించాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను మాత్రం అస్సలు చూడకూడదు. ఎందుకంటారా..? ఈ వీడియో చూస్తే…ఒళ్లు ఒళ్లు గగుర్పొడిచేస్తుంది. అంతటి భయానక క్షణాన్ని చూసి తట్టుకోలేరు. ఇంతకీ ఏం జరిగిందంటారా..? కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి తాను ప్రయాణిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోతుండగా…ఆ భయానక క్షణాన్ని తన కెమెరాలో బంధించాడు. నికోలస్ మెక్ కాల్ మొదటిసారిగా ఎయిర్ బెలూన్ రైడ్ కు వెళ్లాడు. అయితే తాను ప్రయాణిస్తున్న సమయంలో భయంకరమైన గాలులు వీచాయి. దీంతో ఆ హాట్ బెలూన్ క్రాష్ అవుతూ నేలకు తాకుతోంది. ఈ ఘటనను మెక్ కాల్ వీడియో తీసి టిక్ టాక్ లో పోస్టు చేశాడు. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
అంతేకాదు అంతటి భయానక పరిస్థితులను కూడా అద్బుతంగా ఉందంటూ వీడియో క్యాప్షన్ ఇచ్చాడు నికోలస్ మెక్ కాల్. మొత్తం 24 సెకన్ల ఉన్న ఈ ఫుటేజీని షేర్ చేశాడు. ఆ హాట్ బెలూన్ లో మెక్ కాల్ తోపాటు చాలా మంది ఉన్నారు. వారి అరుపులు వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. శాన్ డియాగో సమీపంలోని పెర్రిస్ పట్టణం మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఈ బెలూన్ క్రాష్ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.