Vikram Veda Movie: హృతిక్ స్పెషల్ పోస్టర్!
- By hashtagu Published Date - 01:53 PM, Mon - 10 January 22

తమిళంలో 2017లో వచ్చిన భారీ హిట్ మల్టీ స్టారర్ చిత్రాలలో ఒకటి ‘విక్రమ్ వేద’. విజయ్ సేతుపతి – మాధవన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ చిత్రాన్నీ పుష్కర్ – గాయత్రి, హిందీలోనూ.. రీమేక్ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాలో హృతిక్ రోషన్ – సైఫ్ అలీ ఖాన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. టి సిరీస్ – రిలయన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, కరోనా కారణంగా సెట్స్ పైకి ఆలస్యంగా వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది.
ఈ రోజున హృతిక్ రోషన్ బర్త్ డే కావడంతో, ఈ సినిమా నుంచి ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన ‘వేద’ పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని చిత్రబృందం తెలిపింది.