Mahesh Babu: సర్కారు ప్రిరిలీజ్ కు తమిళ్ స్టార్ హీరో
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కోలివుడ్ సూపర్ స్టార్ విజయ్ మధ్య మంచి స్నేహం ఉంది.
- By Balu J Published Date - 03:19 PM, Sat - 7 May 22
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కోలివుడ్ సూపర్ స్టార్ విజయ్ మధ్య మంచి స్నేహం ఉంది. మహేశ్ హిట్ మూవీస్ ను తమిళంలో రిమేక్ చేసి పలు సక్సెస్ లను అందుకున్నారు విజయ్. మహేశ్ నటిస్తున్న సర్కారు వారి పాట ప్రిరిలీజ్ ఈవెంట్ ఇవాళ (శనివారం) జరగనుంది. అయితే లెటెస్ట్ సమాచారం ఏంటంటే.. ఈ ప్రిరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విజయ్ రానున్నట్టు సమాచారం. వంశీ పైడిపల్లితో విజయ్ ‘తలపతి 66’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
అయితే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరగనున్న ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విజయ్‌కి ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి విజయ్ హాజరవుతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. వంశీ పైడిపల్లి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘మహర్షి’ చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకోవడం గమనార్హం. మహేష్ బాబు, విజయ్‌ల స్నేహాన్ని పరిశీలిస్తే, గతంలో ఈ ఇద్దరు స్టార్స్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్నారు. ఒకరు విసిరిన ఛాలెంజ్ ను మరొకరు యాక్సెప్ట్ చేశారు. ఇద్దరి ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక పుట్టినరోజు వేడుకులకు సైతం క్రమం తప్పకుండా ఒకరినొకరు విష్ చేసుకుంటారు. ఇప్పుడు, విజయ్ ‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైతే, ఇద్దరు హీరోల అభిమానులకు పండుగ లాంటిదే!
Related News
Rajinikanth Jailer 2 : జైలర్ 2 కి అదిరిపోయే టైటిల్.. డబుల్ ఇంపాక్ట్ పక్కా..!
Rajinikanth Jailer 2 సూపర్ స్టార్ రజినికాంత్ సూపర్ హిట్ మూవీ జైలర్ ఆయన్ను తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది.