Money Heist: నీ తెలివి తెల్లారా…ఇదేం పనిరా అయ్యా…వీడియో వైరల్..!!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతూ ట్రెండ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల ట్రెండ్ కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది.
- By Hashtag U Published Date - 10:42 AM, Sat - 9 April 22
 
                        ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతూ ట్రెండ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల ట్రెండ్ కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కుడ వెడ్డింగ్ లో ఎలాంటి ఘటనలు జరిగినా నిమిషాల్లోనే వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలో ఒక ముస్లిం పెళ్లి జరుగుతుంది. సాధారణంగా కొందరు వరుడి మెడలో నోట్ల కట్టలను పూలామలాగా కట్టివేస్తారు. ప్రస్తుతం ఇక్కడ వరుడికి కూడా నోట్లను దారానికి చుట్టి మెడలో వేశారు. ఎన్నోరకాల నోట్లు అతని మెడలో ఉన్నాయి. ఈ వెడ్డింగ్ కు వరుడి తరపు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఇంతలోనే వరుడి పక్కన ఒక యువకుడు కూర్చున్నాడు.
వరుడు ఇతరులతో మాట్లాడుకుంటూ తన బిజీలో తాను ఉన్నాడు. వరుడు నోట్ల దండను తన ముందుకు పెట్టుకోగా…ఈ క్రమంలో పక్కన కూర్చున్న ఒక వ్యక్తి…తన చేతివాటం ప్రదర్శించాడు. మెల్లగా కొన్ని నోట్లను తెంపి…తన జేబులో వేసుకున్నాడు. తనకేం తెల్వదు…నేనేం చేయలే అంటూ మోహం తిప్పుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు…పెళ్లికి వచ్చి ఇదేం పాడుపనిరా అయ్యా అంటూ తిట్టిపోస్తున్నారు.
 
                    



