Kedarnath Rains: భారీ వర్షం కారణంగా నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర
భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- By Hashtag U Published Date - 01:27 PM, Tue - 24 May 22

భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2013 కేదార్‌నాథ్ వరద మిగిల్చిన విషాదం నేపథ్యంలో ముందస్తుగా అధికారులు చర్యలు ప్రారంభించరారు. రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం వాతావరణం అనుకూలించే వరకు యాత్రికులు తమ తమ స్టేషన్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం ఉదయం వరకు కేదార్‌నాథ్‌లోని శివాలయంలో పూజలు చేసిన ప్రజలు తిరుగు ప్రయాణం చేయకుండా నిలిపివేసినట్లు రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. అదేవిధంగా, గౌరీకుండ్ బేస్ క్యాంప్ నుండి కేదార్‌నాథ్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు పుణ్యక్షేత్రానికి వెళ్లకుండా ఆపివేసినట్లు ఆయన చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు.