USA: గ్రీన్ కార్డ్ విషయంలో ఆశలు రేపి పరిణామాలు.. వారందరికీ అందుబాటులోకి?
ఇండో అమెరికన్ లు ఎన్నో ఏళ్ల నుంచి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే వాటికీ ఆశలు రేపే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా కుటుంబ స
- By Anshu Published Date - 04:50 PM, Fri - 7 July 23

ఇండో అమెరికన్ లు ఎన్నో ఏళ్ల నుంచి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే వాటికీ ఆశలు రేపే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా కుటుంబ సభ్యులు, ఉద్యోగాల కేటగిరిలో 1992 నుంచి నిరుపయోగంగా ఉన్న గ్రీన్ కార్డులను స్వాధీనం చేసుకోవాలని, ఆసియా అమెరికన్లు, హవాయిన్లు, పసిఫిక్ ద్వీపాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్న అజయ్ భుటోరియా తెలిపారు. 1992-2022 వరకు జారీ చేసిన 2,30,000 ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది.
దీంతో పాటుగా ప్రతి ఏడాది ఈ కేటగిరిలో జారీ చేసే 1,40,000 లక్షల కార్డులతో పాటు స్వాధీనం చేసుకొన్న వాటిల్లో కొన్నింటిని ప్రాసెస్ చేస్తారు. కాగా వీటిలో నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డుల స్వాధీనం భవిష్యత్తులో ఈ కార్డుల వృథాను తగ్గిస్తుంది అని అజయ్ పేర్కొన్నారు. గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో ప్రాసెసింగ్ జాప్యాన్ని పరిష్కరిస్తుందని అన్నారు. దీంతోపాటు ఎన్నో ఏళ్లుగా గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి ఉపశమనం లభిస్తుందని అన్నారు. ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కుటుంబాలు, ఉద్యోగాల కోసం ఏటా కొన్ని ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేయడానికి కాంగ్రెస్ అనుమతులు జారీ చేసింది.
కానీ, బ్యూరోక్రసీ జాప్యం కారణంగా వీటిల్లో కొన్ని అందుబాటులో ఉన్న గ్రీన్‌కార్డులను ఉపయోగించుకోలేకపోతున్నాయి. ఫలితంగా అవి నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డుల జాబితాలో చేరుతున్నాయని అజయ్ వివరించారు. ఇందుకు రెండు పరిష్కారాలను సూచించారు. అందులో 1992-22 వరకు నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డులను వార్షిక కోటా కార్డులతోపాటు ప్రాసెస్ చేయడం వీటిల్లో ఒకటి. ఇక రెండో పరిష్కార మార్గంగా స్టేట్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీతో కలిసి పనిచేసి కొత్త పాలసీని అమల్లోకి తీసుకురావాలి. దీని ప్రకారం ఏటా మంజూరయ్యే వార్షిక కోటా గ్రీన్ కార్డులను సదరు ఏజెన్సీలు తక్షణమే పేపర్ వర్క్ పూర్తిచేయకపోయినా అర్హులైన వలసదారులకు అందుబాటులో ఉంచాలి.