HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Us Is Destroying The Last Of Its Once Vast Chemical Weapons Arsenal

USA: రహస్య రసాయనాల ఆయుధాల ధ్వంసం ప్రక్రియ వేగవంతం?

అమెరికా ఒకప్పుడు ఎంతో రహస్యంగా నిల్వ చేసిన రసాయన ఆయుధాల చివరి విడత నిల్వల ధ్వంసం మొదలైంది. ఈ రహస్య రసాయన ఆయుధాల ధ్వంసం ప్రక్రియ చివరి

  • Author : Anshu Date : 07-07-2023 - 4:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Usa
Usa

అమెరికా ఒకప్పుడు ఎంతో రహస్యంగా నిల్వ చేసిన రసాయన ఆయుధాల చివరి విడత నిల్వల ధ్వంసం మొదలైంది. ఈ రహస్య రసాయన ఆయుధాల ధ్వంసం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కాగా కొలరాడోలో ఆ దేశ సైన్యానికి చెందిన రసాయన డిపోల్లో వీటిని ధ్వంసం చేసే ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేపట్టింది. ఇందుకోసం మనుషులను కాకుండా ప్రత్యేకంగా రోబోలను కూడా తెప్పించారు. ఈ డిపోలో అత్యంత ప్రమాదకరమైన మస్టర్డ్‌ ఏజెంట్స్‌ తో చేసిన శతఘ్ని తూటాలు కూడా ఉన్నాయి.

వీటిని రోబోలు జాగ్రత్తగా విడదీసి, కడిగి, దాదపు 1,500 ఫారెన్‌ హీట్‌ ఉష్ణానికి గురి చేస్తున్నాయి. దీంతో ఆ తూటాలు తుక్కువలే మారపోతాయని ఆర్మ్స్‌ కంట్రోల్‌ విభాగానికి చెందిన డిప్యూటి అసిస్టెంట్‌ డిఫెన్స్‌ సెక్రటరీ కింగ్‌స్టన్‌ రీఫ్‌ వెల్లడించారు. ఎప్పటినుంచో అమెరికాలో ఉన్న నిల్వలు మొత్తాన్ని నాశనం చేయడం కోసం దాదాపు కొన్ని దశాబ్దాలు పట్టిందని తెలిపారు. ఇప్పుడు ఆ పని చివరి దశకు చేరినట్లు వెల్లడించింది. ప్యూబ్ లో సమీపంలోని డిపోలో చివరి ఆయుధాన్ని జూన్‌లో ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇక కెంటకీలోని మరో డిపోలో మిగిలిన రసాయన ఆయుధాల విధ్వంసం కూడా త్వరలోనే మొదలవుతుందని వెల్లడించింది.

ఈ ప్రక్రియ పూర్తయితే ప్రపంచంలో అధికారికంగా ప్రకటించిన రసాయన ఆయుధాలు మొత్తం కనుమరుగైనట్లవుతాయి. కాగా అమెరికా కొన్ని తరాలుగా ఈ రసాయన ఆయుధాల నిల్వలను పోగేసింది. తొలి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ ఆయుధాల విధ్వంసం తెలిసొచ్చింది. కానీ, అమెరికా సహా పలు దేశాలు మాత్రం వాటిని భారీ స్థాయిలో అభివృద్ధి చేశాయి. అమెరికా వద్ద బయోలాజికల్‌ ఆయుధాలు కూడా ఒకప్పుడు భారీగా ఉండేవి. కానీ, 1970ల్లో వాటిని ధ్వంసం చేసింది. ఇక 1989లో తమ వద్ద ఉన్న రసాయన ఆయుధాలను ధ్వంసం చేయాలని సోవియట్‌, అమెరికా నిర్ణయించాయి. ఇక బ్రిటన్‌ 2007లో, భారత్‌ 2009లో, రష్యా 2017లో తమ వద్ద ఉన్న రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినట్లు అధికారికంగా పేర్కొన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arsenal
  • chemical weapons
  • destroying
  • USA

Related News

H 1b Visa New Rules

H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో కొత్త నిబంధనలు..

H1B Visa Rules  అమెరికా డాలర్ డ్రీమ్స్ ప్రపంచంలోనే లక్షలాది మంది యువత కల. అక్కడ ఉన్నత విద్య, ఆపై ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఉద్దేశంతో అమెరికాకు విమానం ఎక్కుతారు. ఇక, ప్రతిభావంతులైన విదేశీ వర్కర్ల కోసం ఎలాగూ హెచ్-1 బీ వీసా ప్రోగ్రామ్ ఉండనే ఉంది. కానీ, ఈ ప్రోగ్రామ్ కారణంగా అమెరికన్ల ఉద్యోగాలకు భారీగా గండి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో క

    Latest News

    • Family Status: సహజీవన జంటలకు కుటుంబ హోదా.. డిజిటల్ గా జనాభా లెక్కలు..

    • Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా

    • Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

    • Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

    • TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd