TarakaRatna: తారకరత్న హెల్త్‌పై అప్డేట్… అసలు ఏం జరిగిందంటే?
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురై, బెంగళూరు నారాయణ హృదయాల ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నారు
- By Anshu Published Date - 08:11 PM, Thu - 16 February 23

TarakaRatna: టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురై, బెంగళూరు నారాయణ హృదయాల ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నారు నటుడు నందమూరి తారకరత్న. మెుదట వారం రోజులు రోజువారి హెల్త్ అప్‌డేట్ వచ్చింది. ప్రత్యేకంగా తెలుగు మీడియా ప్రతినిధులు అంతా బెంగళూరు కేంద్రంగా ఉండి…లైవ్ అప్‌డేట్స్ ఇచ్చేవారు. నందమూరి, నారా ఫ్యామిలీ సహా బంధువైన విజయసాయి రెడ్డి కూడా తారకరత్న కేర్ తీసుకున్నారు. అయితే ఆ తర్వాత హెల్త్ అప్‌డేట్ రావటం లేదు. అందరూ రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. కానీ తాజాగా హెల్త్ అబ్డేట్ ఇచ్చి షాక్‌కు గురి చేశారు.
గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. అత్యంత విషమ పరిస్థితి ఆయన వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యానికి సంబంధించి తాజాగా అప్డేట్ వచ్చింది. గురువారం తారకరత్నకు ఎం.ఆర్.ఐ స్కా నింగ్ చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మెదడుకు సం బంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయని వైద్యులు తెలిపారు.
తారకరత్నకు మరింత వైద్య సేవలు చేయాలని డాక్టర్లు భావిస్తున్నట్లు తెలిసింది. కీలకమైన టెస్ట్‌లు చేసిన అనంతరం మరోసారి పూర్తిస్థాయి హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా టెన్షన్‌లో ఉన్న ఆయన ఫ్యాన్స్, టీడీపీ నేతలు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియగానే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 27న కుప్పంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తారకరత్నకు గుండెపోటు రాగా ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. విదేశీ వైద్యులను ఆ ఆస్పత్రికి రప్పించి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు రామకృష్ణ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నా రు.