Award Winning: భారత ఫొటోగ్రాఫర్లకు ‘యునిసెఫ్’ అవార్డులు
ఒక చిత్రం.. వేల భావాలకు సమానం.
- Author : Balu J
Date : 30-12-2021 - 5:38 IST
Published By : Hashtagu Telugu Desk
ఒక చిత్రం.. వేల భావాలకు సమానం. అందుకే ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించే ఫొటోల్లో ఎన్నో ఎమోషన్స్ దాగి ఉంటాయి. ఎంతో ఓపిగ్గా, సహనంతో తమ కెరీర్ ను ఇష్టంగా కొనసాగిస్తుంటారు. అలాంటివాళ్లనే అవార్డులును వరిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల జీవన స్థితిగతులకు అద్దం పట్టే మేటి చిత్రాలకు యునిసెఫ్ అవార్డులు ప్రకటిస్తుంటుంది. ఈ ఏడాది కూడా అవార్డులను ప్రకటించగా.. వీటిలో తొలి రెండు బహుమతులు భారత ఫొటోగ్రాఫర్లను వరించడం విశేషం. ఓ చిత్రం.. యునిసెఫ్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్ 2021’గా నిలిచింది. యునిసెఫ్ ఫొటో ఆఫ్ ది ఇయర్ ద్వితీయ బహుమతి కూడా భారత ఫొటోగ్రాఫర్‌కే దక్కడం విశేషం.