Umesh Yadav: రెండో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉమేష్ యాదవ్, తాన్య జంట
- By Balu J Published Date - 05:11 PM, Wed - 8 March 23

భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్, అతని భార్య తాన్య రెండవ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఉమేష్ భారత జట్టులో సభ్యుడు. తమకు ఆడబిడ్డ పుట్టిందని బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఉమేష్ జంటకు 2021లో తన మొదటి బిడ్డ పుట్టింది. అది కూడా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో భారత జట్టు పర్యటిస్తున్న సమయంలోనే. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో అభిమానులు గ్రీటింగ్స్ కు తెలియజేశారు.
ఉమేష్ యాదవ్ ఇంట్లో ఎప్పుడూ మహిళా దినోత్సవం జరుపుకుంటారు అని మరొకరు రాశారు. కాగా ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఉమేష్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి బౌలింగ్ చేయడంతో పర్యాటక జట్టు 12 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

Related News

Future Cricketer: ఈ బాలిక కాబోయే క్రికెటర్..! వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి!
క్రికెట్ కు ఉన్నంత ఆదరణ, ప్రాచుర్యం మరే క్రీడకూ లేదనడం నిజమే. ఏటా రెండు నెలల పాటు ఐపీఎల్ సమరం, అంతర్జాతీయ మ్యాచ్ లు ఎన్నో జరుగుతుంటాయి.