Mecca Masjid: మక్కా మసీదులో వరుసగా సెల్ ఫోన్ చోరీలు!
మక్కా మసీదులో ప్రతిరోజూ సగటున రెండు మొబైల్ ఫోన్లు దొంగిలించబడుతున్నాయి.
- By Balu J Published Date - 01:11 PM, Mon - 11 April 22

మక్కా మసీదులో ప్రతిరోజూ సగటున రెండు మొబైల్ ఫోన్లు దొంగిలించబడుతున్నాయి. రంజాన్ సందర్భంగా ప్రార్థనల అనంతరం మసీదు అధిపతితో సమావేశం జరిగింది. అయితే ప్రార్థనల సమయంలో చోరీలు జరుగుతుండటంతో మతపెద్దకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం మక్కా మసీదుకు వెళ్లే మైనార్టీ సోదరులు దొంగతనాల విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు బృందాన్ని నియమించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా హుస్సేనీ ఆలం ఇన్‌స్పెక్టర్ జి. నరేష్ కుమార్ మాట్లాడుతూ సివిల్ దుస్తుల్లో పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపినట్లు తెలిపారు.