TrueCaller: ట్రూకాలర్ కీలక నిర్ణయం…కాల్ రికార్డింగ్ ఫీచర్ తొలగింపు..!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త రూల్స్ తీసుకొస్తోంది.
- By Hashtag U Published Date - 08:30 PM, Sat - 23 April 22
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త రూల్స్ తీసుకొస్తోంది. మే 11 నుంచి గూగుల్ సర్వీసుల్లో ఒకటైన ప్లే స్టోర్ లో కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటిని తొలగించనుంది. దీంతో కాల్ రికార్డింగ్ ఫీచర్స్ అందిస్తున్న అన్ని యాప్స్ అలర్ట్ అయ్యాయి. తమ యాప్స్ లో ఆటోకాల్ రికార్డింగ్ ఫీచర్లను డిలీట్ చేస్తున్నాయి. కాల్ రికార్డింగ్ యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించిన వెంటనే ప్రముఖ ట్రూకాలర్ యాప్ తన ఫ్లాట్ ఫాం నుంచి కాల్ రికార్డింగ్ ఫీచర్ ను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఫోన్ కాల్స్ ను రికార్డ్ చేసే ఆప్షన్‌ను ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేస్తామని ట్రూకాలర్ వెల్లడించింది. దీంతో యూజర్లు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అందుబాటులోనే ఉంటుంది. కానీ మే 11 ను యాప్ నుంచి డిలీట్ అవుతుంది. ఆండ్రాయిడ్స్ లోని ఇప్పటికే ఉన్న కాల్ రికార్డింగ్ యాప్స్ ను పనిచేయడం ఆగిపోతాయి. ఆ తర్వాత మీరు మీ ఫోన్లో వాయిస్ కాల్స్ ను రికార్డు చేయాలనుకుంటే..మీ స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉన్న ఇన్ బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ పై ఆధారపడాల్సి వస్తుంది. మీ స్మార్ట్ ఫోన్లో ఇన్ బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ లేకపోతే మే 11 తర్వాత మీరు కాల్స్ ను రికార్డు చేయలేరు
గూగుల్ గత కొన్నేళ్లుగా కాల్ రికార్డింగ్ యాప్ సర్వీసులను వ్యతిరేకిస్తూ వస్తోంది. ఎందుకంటే కాల్ రికార్డింగ్ అనేది యూజర్ల ప్రైవసీని ఉల్లంఘించనట్లవుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. గూగుల్ సొంత డయలర్ యాప్స్ లోని కాల్ రికార్డింగ్ ఫీచర్ ఎనేబుల్ అయిన విషయం ముందే యూజరకు తెలుస్తుంది. ఈ కాల్ ఇప్పుడు రికార్డు అవుతుందంటూ వార్నింగ్ వస్తుంది. కాల్ రికార్డింగ్ స్టార్ అయ్యే ముందు రెండు వైపులా వినబడుతుంది. రీకాల్ చేయడానికి గూగుల్ ఆండ్రాయిడ్ 6లో రియల్ టైం కాల్ రికార్డింగ్ బ్లాక్ చేసింది. ఆండ్రాయిడ్ 10లో డివైజుల్లో మైక్రోఫోన్లో కాల్ ఆడియో రికార్డును తొలగించింది.
Tags
Related News
Sundar Pichai: 20 ఏళ్లుగా ఒకే కంపెనీలో.. సుందర్ పిచాయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!
ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) 20 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు.