TRS Tribute: ప్రొఫెసర్ జయశంకర్ యాదిలో..
తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ సార్ జయంతి
- Author : Balu J
Date : 06-08-2022 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత నివాళి అర్పించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆయన చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం.. యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయమని అన్నారు. జయశంకర్ సార్ ఆశించిన స్వయం పాలన సాకరమైంది అనీ, సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది అని హరీశ్ రావు అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ 88 జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో జయశంకర్ విగ్రహానికి అటవీ, పర్యా, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకుంటూ, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ తన జీవితాన్ని ధారపోశారని ఆయన సేవలను కొనియాడారు. జయశంకర్ సర్ తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్ఫూర్తి ప్రధాతగానే నిలుస్తారన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు! pic.twitter.com/ZD0fvTK9T9
— Telangana CMO (@TelanganaCMO) August 6, 2022