HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tpcc Chief Revanth Reddy Following Ysr Style

Revanth YSR Style: రాజన్న బాటలో రేవంత్ రెడ్డి!

ఎక్కడైతే సమర్థవంతమైన పాలన ఉంటుందో.. అక్కడ ప్రజాదరణ ఉంటుంది.

  • By Balu J Published Date - 03:07 PM, Sat - 21 May 22
  • daily-hunt
Revanth
Revanth

ఎక్కడైతే సమర్థవంతమైన పాలన ఉంటుందో.. అక్కడ మాత్రమే ప్రజాదరణ ఉంటుంది. ఈ మాటలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అతికినట్టుగా సరిపోతుంది. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఎంతో నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి వైఎస్సార్. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం కల అనుకుంటే.. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వారి కలను నిజం చేశారు. ఉన్నత చదువులు కొనలేమని భావించిన సరస్వతీ పుత్రులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వరం కల్పించిన ఘనత వైఎస్సార్‌కు దక్కింది. దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ జలయజ్ఞం ఆరంభించారు. రైతు రుణాలు మాఫీ చేసి లక్షల రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు. 2004 మే నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్… తన ప్రజారంజక పాలనతో ప్రత్యేక స్థానం సంపాదించారు.

రైతన్నల కోసం రచ్చబండ

వైఎస్సార్ మరణం తర్వాత ఆ స్థాయిలో ముఖ్యమంత్రిగా రాణించినవాళ్లు చాలా అరుదు అని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. ఆయన పరిపాలన దక్షత, ముందుచూపు నేటి నేతలకు దిక్సూచిగా మారిందనే చెప్పక తప్పదు. అందుకే టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజన్న మార్గాన్ని పాటిస్తున్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం రాజశేఖర్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి మార్పులు చేర్పులు చేసి రైతు డిక్లరేషన్ పేరుతో రైతులకు వద్దకు వెళ్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందనీ?  రైతును రాజుగా చేసేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తోంది? అని చెప్పేందుకు రచ్చబండ ను ఉపయోగించుకోనున్నాడు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబుకు బ్రహ్మరథం పడుతున్న సమయంలో వైఎస్సాఆర్ వరుస పాదయాత్రలు చేసి ప్రజలకు దగ్గరయ్యాడు. ఆయన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. వైఎస్సార్ తరహాలో టీకాంగ్రెస్ పునర్ వైభవం తెచ్చేందుకు పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, యువతను ద్రుష్టిలో ఉంచుకొని కార్యాచరణ తయారు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

సీనియర్లకు చెక్

కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం అసమ్మతి పోరు ఉంటుందనేది నిజం. 2004 సమయంలోనూ కాంగ్రెస్ అసమ్మతి ఉంది. కాంగ్రెస్ పై పట్టు సాధించేందుకు సీనియర్లు కూడా నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డారు. అలాంటి సమయంలోనూ రాజశేఖర్ రెడ్డి అసమ్మతికి చెక్ పెట్టి ఢిల్లీ అండదండలు పొందాడు. రాజశేఖర్ రెడ్డి చరిష్మాను గుర్తించి ఏఐసీసీ పూర్తి అధికారాలను ఇచ్చింది. చాపకింద నీరులా రాజకీయ మంత్రాంగం నడిపి వైఎస్సార్ సీనియర్లను చెక్ పెట్టి సక్సెస్ అయ్యాడు. అపార అనుభవం ఉన్న నేతలు సైతం రాజశేఖర్ రెడ్డి మాట వినకపోలేదు. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి కూడా వైఎస్సాఆర్ మాదిరిగా చతురతను ప్రదర్శించాడు. ఢిల్లీ అధిష్ఠానం రేవంత్ రెడ్డి కి టీకాంగ్రెస్ బాధ్యతలను అప్పగించే.. ఆ మరుసటి రోజు నుంచే సీనియర్ల నుంచి ఎదురుదాడి జరిగింది. ‘‘బాబు మోచేతి నీళ్లు తాగిన నాయకుడికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా’’ అంటూ కొమటిరెడ్డి బ్రదర్స్ మొదలుకొని జగ్గారెడ్డి లాంటి నాయకుల వరకు విమర్శల దాడి మొదలుపెట్టారు. జడ్పీటీసీ నుంచి టీపీసీసీ దాకా ఎదిగిన రేవంత్ రెడ్డి చాపకింద నీరులా సీనియర్లకు చెక్ పెట్టేలా వ్యవహరించారు. సీనియర్లు బహిరంగంగా విమర్శించినా.. ఇతర పార్టీలతో నేతలతో సంప్రదింపులు జరిపినా.. సైలంట్ తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఎప్పుడైతే వర్గ విబేధాలు మొదలయ్యాలో.. రేవంత్ ఢిల్లి వేదికగా రాజకీయాలు నడిపి సీనియర్లకు చెక్ పెట్టి అనుకున్నది సాధించాడు.

ఢిల్లీ అండదండలు

ఒకవైపు పార్టీని, మరోవైపు ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో పరిపాలన కొనసాగించారు వైఎస్సాఆర్. తన మార్క్ తో ఉమ్మడి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చిన రాజశేఖర్ రెడ్డికి ఢిల్లీ నాయకత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన ఆయనకు అప్పట్లో తిరుగు లేకుండాపోయింది. అప్పటివరకు ఢిల్లీ నాయకత్వం ఏదీ చెబితే.. అదే పనిచేసే విధానానికి చెక్ పెట్టాడు. తిరుగులేని రాజసంతో ఓ వెలుగు వెలిగాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వైఎస్సార్ మాదిరిగానే ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ క్రేజ్ ను గుర్తించిన ఏఐసీసీ కూడా పూర్తి స్వేచ్చను ఇచ్చింది. దీంతో వీహెచ్, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి లాంటి సీనియర్స్ సైతం రేవంత్ మాట వినకతప్పన పరిస్థితి. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్ మరింత కష్టపడాల్సి ఉంటుంది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ను ఢీకొట్టడం అంత వీజీ కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అయితే ‘కాంగ్రెస్ ఆకర్ష్’ సక్సెస్ అయితే రేవంత్ పని సులువవుతుందని చెప్పక తప్పదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • political agenda
  • revanth reddy
  • TCongress
  • ysr

Related News

    Latest News

    • Laptop: మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది

    • Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

    • Royal Enfield Bullet 650: బుల్లెట్ బైక్ కొనాల‌నుకునేవారికి అదిరిపోయే శుభ‌వార్త‌!

    • Raina- Dhawan: టీమిండియా మాజీ క్రికెట‌ర్లు రైనా, ధావన్‌లకు బిగ్ షాక్‌!

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd