Salman Khan Sister: సల్మాన్ చెల్లెలి ఇంట్లో చోరీ: ఇంటిదొంగే
సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఇంట్లో చోరీ జరిగింది. అర్పితా ఖాన్ తన మేకప్ ట్రేలో ఉంచిన 5 లక్షల విలువైన చెవిపోగులు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది
- Author : Praveen Aluthuru
Date : 17-05-2023 - 6:48 IST
Published By : Hashtagu Telugu Desk
Salman Khan Sister:సల్మాన్ ఖాన్ సోదరి (Salman Khan Sister) అర్పిత ఇంట్లో చోరీ జరిగింది. అర్పితా ఖాన్ తన మేకప్ ట్రేలో ఉంచిన 5 లక్షల విలువైన చెవిపోగులు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మే 16న జరిగింది. అదే రోజు రాత్రి నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అర్పిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి అర్పిత ఇంట్లో పని మనిషిగా గుర్తించారు. అర్పితా ఖాన్ కు చెందిన వజ్రాల చెవిపోగులు ముంబై పోలీసులు రికవరీ చేసి దొంగను అదుపులోకి తీసుకున్నారు.
నగలు చోరీకి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 30 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.అతను ముంబైలోని విలేపార్లే ప్రాంతంలో నివసిస్తున్నాడు. పట్టుబడ్డ వ్యక్తి అర్పితా ఖాన్ ఇంట్లో ఇంటి పనిమనిషిగా పనిచేసేవాడు. ఈ విషయాన్ని ఖార్ పోలీస్ స్టేషన్‌లోని ఇన్‌స్పెక్టర్ మోహన్ మానే సమాచారం అందించారు, అర్పిత ఇంట్లో నిందితుడుతో సహా 11 మంది పని చేస్తారని ఆయన తెలిపారు. అయితే ఆభరణాలు దొంగిలించి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పరారయ్యాడని విచారణలో తేలిందన్నారు. అతనిపై సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు.
అర్పితా ఖాన్ శర్మ తన భర్త ఆయుష్ శర్మతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు.కాగా.. సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో పాటు పాలక్ తివారీ, షహనాజ్ గిల్, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఈద్ సందర్భంగా సినిమా విడుదలైంది.
Read More: MI v
LSG: కోహ్లీతో పెట్టుకుంటే అంట్లుంటది మరి