Law Student: హీరోయిన్ మీద చేయి వేయిబోయిన విద్యార్థి.. ఏం చేసిందంటే?
మామూలుగానే సినిమా తారలు అంటే అందరికీ ఒక క్రేజ్ ఉంటుంది. సినీ తారలతో ఫోటోలు దిగాలని, వారిని దగ్గరి నుండి చూడాలని చాలామందికి ఆశగా ఉంటుంది.
- By Anshu Published Date - 08:29 PM, Fri - 20 January 23

Law Student: మామూలుగానే సినిమా తారలు అంటే అందరికీ ఒక క్రేజ్ ఉంటుంది. సినీ తారలతో ఫోటోలు దిగాలని, వారిని దగ్గరి నుండి చూడాలని చాలామందికి ఆశగా ఉంటుంది. అయితే సినీ తారలైనా, మరెవరైనా ఇబ్బంది కలగకుండా ఇలా చేస్తే ఇబ్బంది లేదు. కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం హద్దు మీరి ప్రవర్తింస్తుంటారు. తాజాగా తమిళ హీరోయిన్ అపర్ణా బాలమురళి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది.
కేరళలోని ఎర్నాకులం లా కాలేజీలోని ఓ కార్యక్రమానికి వెళ్లిన హీరోయిన్ అపర్ణా బాలమురళితో ఓ విద్యార్థి తప్పుగా ప్రవర్తించాడు. అపర్ణ స్టేజ్ మీద కూర్చొని ఉండగా, ఓ విద్యార్థి అక్కడికి చేరుకొని ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం కుర్చీలో కూర్చోన్న ఆమె చేయి పట్టుకొని పైకి లాగాడు. దీంతో చేసేది లేక ఆమె నిల్చొగానే.. ఆ యువకుడు భుజం పై చేయి వేయబోయాడు. యువకుడి అనుచిత ప్రవర్తనతో ఖంగుతిన్న ఆమె.. అతడి నుండి దూరంగా జరిగింది.
అపర్ణను సదరు విద్యార్థి ఇబ్బంది పెట్టిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. దీనిపై ఆమె ఘాటుగా స్పందించింది. దీనిపై ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘అదొక తీవ్రమైన చర్య. న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమన్న విషయం అర్థం చేసుకోలేరా? బలవంతంగా నా చేయి పట్టుకొని కుర్చీలో నుండి పైకి లేపడం సరైన పద్ధతి కాదు. అంతేకాకుండా అతని చేతులు నా భుజాలపై వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళ పట్ల ప్రవర్తించాల్సిన తీరు కాదిది’ అని వివరించింది. అటు దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని, కేసుల వెంట తిరిగే తీరిక తనకు లేదని చెప్పింది.
కాగా దీనిపై కళాశాల యూనియన్ స్పందిస్తూ.. ‘లా కాలేజీలోని ఓ కార్యక్రమానికి హాజరైన నటికి ఇలాంటి సంఘటన ఎదురుకావడం నిజంగా దురదృష్టకరం. ఈ సంఘన జరిగిన వెంటనే యూనియన్ అధికారి ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆమెకు ఇబ్బంది కలిగేలా చేసినందుకు మరోసారి క్షమాపణలు తెలుపుతున్నాం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, సదరు విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన విద్యార్థిని వారం రోజుల పాటు కాలేజీ నుండి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.