AP Governor : నిర్ణయం మార్చుకున్న గవర్నర్.. టీడీపీ నేతలకు అపాయింట్‌మెంట్ రద్దు
AP Governor : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
- By Pasha Published Date - 10:50 AM, Sun - 10 September 23

AP Governor : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేతలకు తాను ఇచ్చిన అపాయింట్‌మెంట్ ను ఆయన క్యాన్సల్ చేసుకున్నారు. వాస్తవానికి ఇవాళ ఉదయం 9.45 గంటలకు ఆయన టీడీపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అయితే దాన్ని రద్దు చేసుకున్నారని ఏపీ రాజ్‌భవన్ వర్గాలు చెప్పాయి. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని కంప్లయింట్ చేయడానికి కలుస్తామని టీడీపీ లీడర్లు అపాయింట్మెంట్ కోరగా.. ఆదివారం ఉదయం రావాలని గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు.
Also read : Section 49 – Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ పిటిషన్.. సెక్షన్ 409పై వాదనలు.. ఏమిటిది ?
అయితే మీటింగ్ సమయానికి కొన్ని నిమిషాల ముందు అకస్మాత్తుగా.. అపాయింట్మెంట్ ను గవర్నర్ క్యాన్సల్ చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గవర్నర్ అకస్మాత్తుగా నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు ? కారణాలేంటి ? అనే దానిపై డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ గవర్నర్ విశాఖ పర్యటనలో ఉన్నారు. దీంతో అక్కడే ఆయనను కలవాలని టీడీపీ నేతలు భావించారు. కానీ అపాయింట్‌మెంట్ రద్దు కావడంతో కలిసే అవకాశం లేకుండాపోయింది.