CM KCR: బీజేపీ దుమ్ముదులిపిన కేసీఆర్
బీజేపీ విధానాలపై కేసీఆర్ మరోసారి విరుచుకపడ్డారు. దేశంలో గుణాత్మక మార్పు అవసరమని చెప్తూ వస్తోన్న కేసీఆర్ మరోసారి దాని అవసరాన్ని చెప్పారు.
- By Hashtag U Published Date - 10:38 PM, Tue - 1 February 22

బీజేపీ విధానాలపై కేసీఆర్ మరోసారి విరుచుకపడ్డారు. దేశంలో గుణాత్మక మార్పు అవసరమని చెప్తూ వస్తోన్న కేసీఆర్ మరోసారి దాని అవసరాన్ని చెప్పారు. బడ్జెట్ సరిగా లేదని తీవ్ర విమర్శలు చేసిన ఆయన బీజేపీ స్థాయి తగ్గుతోందని, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ స్థానాలు తగ్గుతాయని కేసీఆర్ తెలిపారు.
కేంద్రం తీరురేకు డబ్బాలో రాళ్ళు వేసి లోడ లోడ ఊపినట్లు ఉందని కేసీఆర్ విమర్శించారు. దేశంలోని అన్ని సంస్థలను మోదీ అమ్ముతున్నారని, కేంద్ర ప్రభుత్వం అంతా గోల్ మాల్ చేస్తోందని, బ్లాక్ మని వాళ్ళను బయటకి పంపినా పార్టీ బీజేపీ అని కేసీఆర్ విమర్శించారు.
బీజేపీ లాంటి దరిద్రపు గొట్టు పార్టీ ని కూకటివేళ్ళతో పికి బంగాళాఖాతంలో వేస్తామని కేసీఆర్ తెలిపారు. నిర్మలా సీతారామన్ తనఆత్మ కి ద్రోహం చేస్తున్నారని, కేంద్రం వద్ద కులుస బుద్ధి ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇష్టమున్నట్టు అబద్ధాలు చెబుతుందని కేసీఆర్ విమర్శించారు.
మందికి పుట్టిన వాళ్ళని బీజేపీ వాళ్ళు తమ బిడ్డలని ముద్దాడుతారని, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ కి వచ్చేది గుండు సున్నానని, లక్షలాది ఉద్యోగాలున్న మోదీ ప్రభుత్వం భర్తీ చేయట్లేదని కేసీఆర్ విమర్శించారు.