Techie Died: దొంగ నుండి ఫోన్‌ను పట్టుకునే క్రమంలో రైలు కింద పడి టెకీ మృతి
రైల్లో ఫుట్‌బోర్డు వద్ద నిల్చొని ప్రయాణించడమే యువకుడికి శాపమైంది. పండుగకు ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన యువకుడు తిరిగిరాని లోకాలకు చేరాడు.
- By Praveen Aluthuru Published Date - 03:47 PM, Fri - 30 June 23

Techie Died: రైల్లో ఫుట్‌బోర్డు వద్ద నిల్చొని ప్రయాణించడమే యువకుడికి శాపమైంది. పండుగకు ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన యువకుడు తిరిగిరాని లోకాలకు చేరాడు.
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. అన్యాయంగా ఓ ఐటీ మేనేజర్ ప్రాణాలు కోల్పోయాడు. ముప్పా శ్రీకాంత్ హైదరాబాద్ లో ఓ ఐటీ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. శ్రీకాంత్ తొలి ఏకాదశి సందర్భంగా తన ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. సికింద్రాబాద్ నుంచి హన్మకొండ జిల్లాకు వెళ్లాల్సిన శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. రైలు రద్దీగా ఉండడంతో శ్రీకాంత్‌కి డోర్ వద్ద నిల్చున్నాడు. రైలు బీబీనగర్ రైల్వేస్టేషన్ దాటుతున్న సమయంలో శ్రీకాంత్ ఫోన్‌లో మాట్లాడుతుండగా పట్టాల దగ్గర నిలబడిన ఓ దొంగ శ్రీకాంత్ చేతిలోని మొబైల్‌ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన శ్రీకాంత్ అదుపుతప్పి రైలు నుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటన బీబీనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
శ్రీకాంత్ మరణవార్తతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీకాంత్ ఏడాదికి పైగా హైదరాబాద్ లోని ప్రముఖ సాఫ్త్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి ధనమ్మ గృహిణిగా పనిచేస్తుండగా, తండ్రి రాములు రైతు.
Read More: Social Media Day : “సోషల్” వెలుగుల్.. ప్రతి ఒక్కరి చేతిలో మీడియా