BiggBoss5: బిగ్ బాస్5 విన్నర్ గా సన్నీ.. ఎంత డబ్బు గెలిచాడంటే
బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయింది. సీజన్5 లో సన్నీ విజేతగా నిలిచాడు. 105 రోజులు నడిచిన ఈ గేమ్ లో మెదటి రోజు 19 మందితో ఆట మొదలైంది.
- By Siddartha Kallepelly Published Date - 10:54 PM, Sun - 19 December 21

బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయింది. సీజన్5 లో సన్నీ విజేతగా నిలిచాడు. 105 రోజులు నడిచిన ఈ గేమ్ లో మెదటి రోజు 19 మందితో ఆట మొదలైంది. వారానికి ఒకరు ఎలిమినేట్ అవ్వగా చివరికి టాప్ 5 లో సన్నీ, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్ చంద్ర, సిరి లు మిగిలారు.
టాప్ 5లోని ఐదుగురి ఆట ఆసక్తిగా మారింది. ఈ ఐదుగురి మధ్య పలు టాస్కులు, గేమ్స్ ఆడించారు. వీరిలో నుండి మొదట సిరి ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత మానస్, శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అయ్యారు. ఇక చివరికి షణ్ముఖ్, సన్నీ ల మధ్య నెలకొన్న పోటీలో అభిమానులు సన్నీకే మద్దతుగా నిలిచారు.
సీజన్ 5 విన్నర్ గా గెలిచిన సన్నీకి 50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు. దానితో పాటు 25 లక్షల విలువగల 300 గజాల స్పాన్సర్స్ అందించిన ప్లాట్ కూడా సొంతం చేసుకున్నారు.
Bigg Boss Telugu 5 winner: Actor VJ Sunny lifts the trophy! Congratulations 🎉#VJSunny #BigBossTelugu5 #VJSunnyHistoricBB5Win pic.twitter.com/7ti9LjVaBG
— Sreedhar Sri (@SreedharSri4u) December 19, 2021