Rajasthan Crisis : రాజస్థాన్ సంక్షోభంపై సమగ్ర నివేదికను కోరిన సోనియా
రాజస్థాన్ సంక్షోభంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమగ్ర నివేదికను కోరారు...
- By Prasad Published Date - 10:19 PM, Mon - 26 September 22

రాజస్థాన్ సంక్షోభంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమగ్ర నివేదికను కోరారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇస్తున్న పలువురు ఎమ్మెల్యేలు బహిరంగ తిరుగుబాటుకు దిగిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అజయ్ మాకెన్‌ను దీనిపై సమగ్ర నివేదికను ఆమె కోరారు. టెన్ జన్‌పథ్ నివాసంలో అజయ్ మాకెన్, సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ సోనియాగాంధీని కలిశారు.