SIP: పదేళ్లలో మీ చేతికి రూ. 2 కోట్లు రావడం ఖాయం.. ఇందుకోసం ఏం చేయాలంటే?
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒకవైపు జాబ్ చేస్తూనే మరొకవైపు అదనంగా ఆదాయం వచ్చే మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా వివిధ బి
- By Anshu Published Date - 03:00 PM, Sun - 10 September 23

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒకవైపు జాబ్ చేస్తూనే మరొకవైపు అదనంగా ఆదాయం వచ్చే మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా వివిధ బిజినెస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చాలామంది లాభపడుతుండగా మరికొందరు ఎలాంటి బిజినెస్ లో ఇండస్ట్రీమెంట్ చేయాలో తెలియక నష్టపోతున్నారు. అటువంటి వారు మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నా మీ ఆశయాన్ని సాధ్యం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా హైరిటర్న్స్ ఉంటాయి. అయితే, అదే స్థాయిలో రిస్క్ సైతం ఉంటుంది.
ఇందులో రిస్క్ ఎక్కువ తీసుకునే వారు సరైన ప్రణాళికతో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ ఆశించవచ్చు. అలా 10 ఏళ్లలోనే రూ. 2 కోట్లు అందుకోవడం కూడా పెద్ద విషయమేమీ కాదనే చెప్పవచ్చు. అయితే, 10 ఏళ్ల స్వల్ప కాలిక వ్యవధిలోనే మీరు మిలియనీర్ కావాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. అక్కడ మీరు ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేస్తే చాలు. మీరు క్రమ శిక్షణతో కూడిన పెట్టుబడిదారుగా ఉండాలి. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ పెట్టుబడులను తగ్గించకుండా అవసరమైతే ఇతర ఖర్చులను తగ్గించుకోగలిగేలా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ప్రతి ఏడాది డిపాజిట్ మొత్తాన్ని, మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపసంహరించుకోకుండా పెంచుతూ పోతుంటే మీరు సులభంగా 15 శాతం వరకు రాబడిని పొందే అవకాశం ఉంటుంది.
కాగా మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ ప్రకారం మీరు 10 ఏళ్ల టెన్యూర్‌లో రూ. 2 కోట్లు సంపాదించాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయానికి వస్తే.. ఇందులో మనకు ప్రధాన పాత్ర పోషించేది రేట్ ఆఫ్ రిటర్న్. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మీరు రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. రేట్ ఆఫ్ రిటర్న్ అనేది 13 శాతంగా వస్తుందని అనుకుంటే మీరు నెలకు రూ. 81, 954 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 10 ఏళ్లలో మీ పెట్టుబిడ రూ. 98.35 లక్షలు అవుతుంది. రేట్ ఆఫ్ రిటర్న్ 14 శాతంగా అనుకుంటే మీరు నెల నెల సిప్ చేయాల్సిన డబ్బు రూ. 77,200 అవుతుంది. మీ మొత్తం సొమ్ము రూ. 92.64 లక్షలు అవుతుంది. రేట్ ఆఫ్ రిటర్న్ 15 శాతంగా అనుకుంటే మీరు నెలకు సిప్ చేయాల్సిన డబ్బులు రూ. 72, 700గా ఉంటుంది. మీరు కట్టే మొత్తం రూ. 87 లక్షలు అవుతుంది. ఈ విధంగా రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మారుతూ ఉంటుంది. అందేకే మీరు అనుకున్న లక్ష్యాన్ని అందుకునేందుకు మీరు తక్కువ ఆర్ఓఐని ఎంచుకుని మీ పెట్టుబడిని పెంచుకోవడం ఉత్తమమైన మార్గం.