HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shocked At Silence Of Pm 13 Opposition Leaders Issue Joint Statement Against Communal Violence

Modi: 13 పార్టీల సంయుక్త ప్రకటనకు గులాబీ బాస్ దూరం

" ముస్లింలను లక్ష్యంగా చేసుకొని కొందరు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నా..

  • By Hashtag U Published Date - 01:52 PM, Sun - 17 April 22
  • daily-hunt
Pm Modi
Pm Modi

” ముస్లింలను లక్ష్యంగా చేసుకొని కొందరు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండటం సరికాదు. మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ప్రధాని విఫలం అయ్యారు” అని దేశంలోని 13 ప్రతిపక్ష పార్టీలు వ్యాఖ్యానించాయి. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఈ 13 పార్టీల జాబితాలో టీఆర్ఎస్ లేదు. బీజేపీ పై రాజీలేని పోరాటం చేస్తానని చెబుతున్న సీఎం కేసీఆర్.. దీనిపై ఎందుకు సంతకం చేయలేదు ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా తన ప్రతి ప్రెస్ మీట్ లో ప్రధాని మోడీపై , బీజేపీ పై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న కేసీఆర్.. ప్రతిపక్షాల సంయుక్త ప్రకటనలో భాగం కాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి ? అనేది తెలియాల్సి ఉంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తానంటున్న సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని ఇతర ప్రాంతీయ పార్టీలు శంకించేందుకు ఈ పరిణామం ఊతమిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ సంయుక్త ప్రకటనపై సంతకం చేయాలనే విజ్ఞప్తి సీఎం కేసీఆర్ కు అందిందా ? అందలేదా ? ఒకవేళ విజ్ఞప్తి అందినా.. సంతకం చేయడానికి సీఎం కేసీఆర్ తిరస్కరించారా ? అనేది తెలియాల్సి ఉంది.

కనీసం దీనిపై సీఎం కేసీఆర్ ప్రజలకు సమంజసమైన వివరణ ఇచ్చుకోగలిగితే కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు సూచిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో.. కాంగ్రెస్, ఎన్‌సీపీతో పొత్తులో ఉన్న శివసేన కూడా ఈ ప్రతిపక్షాల సంయుక్త ప్రకటనలో భాగం కాకపోవడం గమనార్హం. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిగా మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. రోజూ బీజేపీ పై నిప్పులు చెరుగుతున్న శివసేన సంయుక్త ప్రకటనపై సంతకం చేసే సాహసం మాత్రం చేయలేకపోయింది.

సంతకం చేసింది ఎవరు ?

సంయుక్త ప్రకటనపై సంతకం చేసినవారిలో కాం గ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(టీఎంసీ), తమిళనాడు సీఎం స్టాలిన్ (డీఎంకే), జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్(జేఎంఎం), ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన దేబబ్రత బిశ్వాస్, ఆర్‌ఎస్‌పీకి చెందిన మనోజ్ భట్టాచార్య, ముస్లిం లీగ్‌కు చెందిన పీకే కున్హాలికుట్టి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌కు చెందిన దీపాంకర్ భట్టాచార్య ఉన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CK KCR
  • pm modi

Related News

Harleen Deol Asks PM Modi

Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ కూడా జట్టు ఈ ఆలోచనను, ఉత్సాహాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.

  • India Cricket Team

    PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

Latest News

  • Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

  • Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

  • Android Old Version : మీరు ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారా..?

  • Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

  • Bike Thief : పోలీసులకే సవాల్ విసిరిన దొంగ..కట్ చేస్తే లోకేష్ ట్వీట్

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd