Texas Road Accident: టెక్సాస్‌లో ప్రయాణికులపై దూసుకెళ్లిన రేంజ్ రోవర్: ఏడుగురు మృతి
అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సిటీ బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న ప్రయాణికుల్ని వాహనం ఢీకొట్టడంతో ఏడుగురు మరణించారు మరియు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
- Author : Praveen Aluthuru
Date : 08-05-2023 - 6:53 IST
Published By : Hashtagu Telugu Desk
Texas Road Accident: అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సిటీ బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న ప్రయాణికుల్ని వాహనం ఢీకొట్టడంతో ఏడుగురు మరణించారు మరియు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు ప్రమాదం జరిగిందని బ్రౌన్స్‌విల్లే పోలీసు అధికారి మార్టిన్ శాండోవల్ తెలిపారు. ఆశ్రయం బిషప్ ఎన్రిక్ శాన్ పెడ్రో ఓజానామ్ సెంటర్ డైరెక్టర్ విక్టర్ మాల్డోనాడో మాట్లాడుతూ, ప్రమాదం గురించి కాల్ వచ్చిన తర్వాత తాను CCTVని తనిఖీ చేసానని, ఓ కారు ప్రయాణిలపైకి దూసుకెళ్లిందని తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది వెనిజులా పురుషులేనని ఆయన చెప్పారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు
బస్టాప్‌లో కూర్చున్న వారిని ఢీకొట్టిన తర్వాత ఎస్‌యూవీ రేంజ్ రోవర్ దాదాపు వంద అడుగుల మేర దూసుకెళ్లినట్లు వీడియోలో చూశామని మాల్డోనాడో తెలిపారు. డ్రైవర్ ఎవరనేది పోలీసులు వెల్లడించలేదు.ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపై అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికుల సమాచారం ప్రకారం కారు అదుపు తప్పి కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Read More: Fire Accident: అమెరికా బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 27మంది మృతి