Same-Sex Marriage Verdict: స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దకు నో చెప్పిన సుప్రీం
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది స్వలింగ వివాహాల చట్టబద్దతకు రెడ్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
- By Praveen Aluthuru Published Date - 03:50 PM, Tue - 17 October 23

Same-Sex Marriage Verdict: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది స్వలింగ వివాహాల చట్టబద్దతకు రెడ్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని పేర్కొంది. అయితే ఈ కేసుపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం తెలిపింది. అయితే అది కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పునిచ్చింది. వివాహ వ్యవస్థకు సంబంధించి సుప్రీం జోక్యం చేసుకోలేమని, వివాహానికి సంబందించిన విషయాలపై పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది.
సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పది రోజుల విచారణ తర్వాత మే 11 న స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు కోసం పిటిషన్ల తీర్పును నిలిపివేసింది. అటు శాసన సవరణల ద్వారా వివాహాలను గుర్తించే అధికారం న్యాయస్థానాలకు లేదని వాదిస్తూ, స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ 21 కంటే ఎక్కువ పిటిషన్లపై కేంద్రం వ్యతిరేకంగా పోరాడుతుంది. వివాహ సమానత్వాన్ని కోరుకునే వారు పట్టణ ప్రముఖులు అని కేంద్రం వాదించింది. ఈ వాదనపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..ఎలాంటి డేటా లేకుండా ఏ ప్రాతిపదికన దీన్ని రూపొందించారని ప్రశ్నించింది.
Also Read: Jio Debit Cards : ‘జియో’ డెబిట్ కార్డ్స్ కూడా వస్తున్నాయ్..