Russia Ukraine War:పుతిన్ దెబ్బకు సుందర్ పిచాయ్ కు చుక్కలే..!!
గత నెల రోజులుగా రష్యా...ఉక్రెయిన్ పై దాడికి తెగబడుతూనే ఉంది. ఇప్పటికే అనే ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. ఎక్కడ చూసినా స్మశాన వాటికలు తలపిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆర్మీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు.
- By Hashtag U Published Date - 12:17 PM, Thu - 24 March 22
గత నెల రోజులుగా రష్యా…ఉక్రెయిన్ పై దాడికి తెగబడుతూనే ఉంది. ఇప్పటికే అనే ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. ఎక్కడ చూసినా స్మశాన వాటికలు తలపిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆర్మీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిఘటిస్తూనే ఉంది. దీంతో 28రోజులు అవుతున్నా…ఇప్పటికే ఉక్రెయిన్ దేశాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు. ఈ సమయంలోనే ఉక్రెయిన్ కు పరోక్షంగా…ప్రపంచ దేశాలు, నాటో దేశాలు సహాయసహకారాలు అందిస్తున్నాయి. దీంతో రష్యాను జెలెన్ స్కీ సైన్యం గట్టిగానే ఎదుర్కొంటున్నాయి.
రష్యా…ఓవైపు చర్చలు జరుపుతూనే..మరోవైపు ఉక్రెయిన్ పై దాడులకు దిగుతోంది. పుతిన్ చర్యను ప్రపంచ దేశాలు ఏకతాటిపై వ్యతిరేకిస్తున్నా…పుతిన తన మారణహోమాన్ని మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే కీవ్ , ఖర్కిక్, ఖేర్సన్, ఇర్ఫిన్ లోని పలు భవనాలు, ఆసుపత్రులు, సినిమాథియేటర్లు బాంబు దాడులకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 30లక్షల మంది ఉక్రెయిన్ వదిలి ఇతర దేశాలకు వలస వెళ్లినట్లుగా ఐక్యరాజ్యసమితి రిపోర్టులు చెబుతున్నాయి. మరికొంతమంది జెలెన్ స్కీ పిలుపుతో…దేశం కోసం యుద్ధంలో పాల్గొన్నారు. ఇక పలు దేశాలు రష్యాపై ఆర్థిక, వాణిజ్య, రవాణా వంటి పలు అంశాలపై ఆంక్షలను విధించాయి. అంతేకాదు మాస్టర్ కార్డ్, వీసా, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి. దీంతో పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తోంది.
పుతిన్ మాత్రం ఏ మాత్రం తగ్గనంటున్నారు. ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే అణుదాడులకు కూడా వెనకాడబోమని హెచ్చరికలు జారీచేశారు. దీంతో పలు దేశాలు ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. తమ దేశానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే జైలు శిక్ష అంటూ ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చారు.
ఇప్పుడు తాజాగా గూగుల్ వార్తలను పుతిన్ సర్కార్ నిషేధించింది. ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న దారుణాలను ప్రసారం చేస్తున్నట్లు..యాక్సెస్ ను అనుమతించిందని ఆరోపిస్తూ రష్య కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ ఆల్ఫాబెట్ గూగుల్ న్యూస్ ను బ్లాక్ చేసిందని ఇంటర్ ఫాక్స్ వార్తా సంస్థ తెలిపింది. ఏజెన్సీ వివరాలు ఇవ్వలేదు. రష్యన్ చట్టాల ప్రకారం, రష్యన్ మిలిటరీని కించపరిచే విధంగా ఏవైనా సంఘటనలు ప్రసారం చట్ట విరుద్ధం. రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు రెగ్యులేటర్ రోస్కో మ్నాడ్జోర్ చర్య తీసుకుంటున్నట్లు ఇంటర్ ఫాక్స్ తెలిపింది.
Related News
Google Messages App: గూగుల్ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్.. ఇది ఎలా పని చేస్తుందంటే..?
ఆండ్రాయిడ్ కోసం గూగుల్ మెసేజింగ్ యాప్ (Google Messages App) స్మార్ట్ఫోన్లలో భద్రతను మెరుగుపరచడానికి, స్పామ్‌ను తగ్గించడానికి కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది.