BRS Party: కెసిఆర్ ఓటమిని గ్రామీణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు : అల్లిపూరం
- By Balu J Published Date - 11:32 PM, Sat - 11 May 24

BRS Party: కొడంగల్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపూరం వెంకటేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గంలో 25 రోజులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించామని, గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ను ఓడించినందుకు కెసిఆర్ ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నానని, కొడంగల్ నియోజకవర్గంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, గత నాలుగు టర్మలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనుభవం ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిని మరిచి సొంత ఇమేజ్ కోసమే పాటుపడ్డారన్నారని, కెసిఆర్ తెలంగాణను భారతదేశం లోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, జై తెలంగాణ అని కూడా అనలేదని అన్నారు. కొడంగల్ లో అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ హయంలోని జరిగిందన్నారు. కొడంగల్ లో ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ రాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో కేవలం ఆర్ఆర్ టాక్స్లను మాత్రమే వసూలు చేస్తున్నాడన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎనిమిది నుంచి పది సీట్లు గెలుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ శాసన రామకృష్ణ, కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి, నాయకులు వెంకట్ నర్సిములు, మాధవ్ రెడ్డి, డి కే రాములు, సుభాష్, నీలప్ప , అనంతయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.