Election Code : ఎన్నికల వేళ..మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత
మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో రూ.5.73కోట్ల బంగారాన్ని గుర్తించారు
- By Sudheer Published Date - 09:42 PM, Mon - 18 March 24

ఎన్నికల వేళ (Election Code)..నల్గొండ జిల్లాలో భారీగా బంగారం (Gold) పట్టుబడడం వార్తల్లో నిలిచింది. మిర్యాలగూడలో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల కోడ్ సందర్బంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11.30 గంటల సమయములో మిర్యాలగూడ పట్టణంలో ఈదులగూడ చౌరస్తా వద్ద ..మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో రూ.5.73కోట్ల బంగారాన్ని గుర్తించారు. బంగారం, వ్యాన్‌తో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.
తనిఖీల్లో రూ.5.73కోట్ల విలువైన బంగారం పట్టుబడిందని ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిఘా పెడుతూ ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. మరి ఆ గోల్డ్ ఎవరిదీ అనేది తెలియాల్సి ఉంది.
Read Also : CM Revanth Reddy Meeting With Sonia : సోనియా, ప్రియాంకా గాంధీలతో సీఎం రేవంత్ భేటీ