News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Reasons Behind Srilanka Financial And Administrative Problems

Sri Lanka Crisis: లంకా ‘దహనం’

అందంగా, ఆనందంగా ఉండే శ్రీలంక ఇప్పుడు భగ్గుమంటోంది. అధికారంలో ఉన్న నేతలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి.

  • By Hashtag U Updated On - 11:24 AM, Tue - 10 May 22
Sri Lanka Crisis: లంకా ‘దహనం’

అందంగా, ఆనందంగా ఉండే శ్రీలంక ఇప్పుడు భగ్గుమంటోంది. అధికారంలో ఉన్న నేతలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి. పోలీసులు కూడా స్టేషన్లను వదిలి.. ఇళ్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి. ఎలాంటి శ్రీలంక ఇలా ఎందుకు అయిపోయింది. రావణాసురిడి కాలంలో స్వర్ణమయంగా శోభిల్లిన లంక ఎక్కడ? అంతర్గత ఆందోళనలతో అట్టుడికిపోతున్న నేటి శ్రీలంక ఎక్కడ? అసలు ఎక్కడ తేడా జరిగింది? ఎప్పుడు తప్పుటడుగు పడింది? శ్రీలంకను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టేశాయి. అప్పు తీర్చడానికి ఆపసోపాలు పడుతోంది. కానీ ఈలోపే దేశమంతా జరుగుతున్న ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. తినడానికి తిండి లేదు.వేసుకోవడానికి మందులు లేవు. తిరగడానికి ఇంధనం లేదు. అసలు ఇంట్లో ఉందామంటే కరెంట్ లేదు. దీంతో లంక వాసుల్లో ఆగ్రహం పెరిగిపోయింది. ప్రస్తుత పాలకులే దీనికి నిదర్శనమంటూ ఆందోళనలకు దిగారు. గతిలేని పరిస్థితుల్లో ప్రధాని రాజపక్సే రాజీనామా చేయాల్సి వచ్చింది.

గత 20 ఏళ్లలో లంక అప్పు 5,630 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇందులో చైనా వాటా 10 శాతం. మన దేశ వాటా 2 శాతం. ఆ దేశ జీడీపీ కన్నా అప్పులు వేగంగా పెరిగాయి. లంకలో విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు కేవలం 231 కోట్ల డాలర్లే ఉన్నాయి. దీనివల్ల పంచదార, చమురు, పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసరాలకు కటకట తప్పలేదు. అమెరికా డాలర్ తో పోలిస్తే.. లంక రూపాయి విలువ ఈ నాలుగు నెలల్లో 50 శాతం తగ్గిపోయింది. అంటే ఒక డాలరును చెల్లించడానికి జనవరిలో 200 శ్రీలంక రూపాయిలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు 300 శ్రీలంక రూపాయిలు ఇవ్వాల్సి వస్తోంది. మన రూపాయి విలువతో పోల్చినా.. ఈ ఏడాది జనవరి-మార్చి నెలల మధ్య 31.6 శాతం క్షీణించింది. బియ్యం ధర 60 శాతం మేర పెరిగింది. ఉల్లిపాయలు 79 శాతం, బంగాళాదుంప 66 శాతం పెరిగాయి. కోడిగుడ్లు రేటు 93 శాతం పెరిగింది.

దేశ జీడీపీలో 10 శాతానికి పైగా వాటా పర్యాటకానిదే. కానీ, 2019లో బాంబుపేలుళ్లు, తరువాత కొవిడ్ దెబ్బతో లంక పర్యాటకం దెబ్బతింది. దీంతో ఆర్థిక కష్టాలు పెరిగాయి. వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల నిషేధంతో వరి, చెరకు దిగుబడులు దారుణంగా తగ్గిపోయాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2018లో 1600 కోట్ల డాలర్లు. 2020లో కేవలం 54.8 కోట్ల డాలర్లు. దీనివల్ల సమస్యలు పెరిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లంకలో పెట్టుబడులు పెట్టడానికి ఏ అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చే అవకాశం లేదు. దీంతో లంకకు ఇప్పట్లో కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావంతో ముడిచమురు, సన్ ఫ్లవర్ నూనె, గోధుమల ధరలు పెరగడంతో వాటిని కొనడానికి లంక కష్టపడుతోంది. మొత్తంగా చూస్తే లంకను అప్పులే ముంచేశాయని అర్థమవుతోంది. దీనికి గత పాలకుల నిర్లక్ష్యంతోపాటు.. ప్రస్తుత పాలకులకు కూడా ముందు చూపు లేకపోవడంతో అప్పుల కుప్ప పెరిగిపోయింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. శ్రీలంక దహనం వెనుక ఇలా అనేక కారణాలు ఉన్నాయి.

Tags  

  • emergency
  • financial crisis
  • Gotabaya Rajapaksa
  • srilanka

Related News

Sri Lanka: శ్రీలంక అంత‌టా క‌ర్ఫ్యూ!

Sri Lanka: శ్రీలంక అంత‌టా క‌ర్ఫ్యూ!

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటోన్న శ్రీలంక దేశ‌మంత‌టా క‌ర్ఫ్యూను విధించారు.

  • Mahinda Rajapaksa: శ్రీలంక ప్ర‌ధాని రాజీనామా

    Mahinda Rajapaksa: శ్రీలంక ప్ర‌ధాని రాజీనామా

  • Emergency In Srilanka: శ్రీలంకలో ఎమర్జెన్సీని విధించిన గొటబాయ ప్రభుత్వం.. శుక్రవారం అర్థరాత్రి నుంచే అమలు

    Emergency In Srilanka: శ్రీలంకలో ఎమర్జెన్సీని విధించిన గొటబాయ ప్రభుత్వం.. శుక్రవారం అర్థరాత్రి నుంచే అమలు

  • Srilanka Emergency: ‘లంకేయులకు’ ఎంత కష్టమొచ్చే!

    Srilanka Emergency: ‘లంకేయులకు’ ఎంత కష్టమొచ్చే!

  • Bandi: ‘ఆర్థిక పరిస్థితి’పై శ్వేత పత్రం విడుదల చేయాలి!

    Bandi: ‘ఆర్థిక పరిస్థితి’పై శ్వేత పత్రం విడుదల చేయాలి!

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: