Yash Dhull:అరంగేట్రం అదిరింది
టీమిండియా అండర్-19 కెప్టెన్ యష్ ధుల్ ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో కూడా అరంగేట్రం చేశాడు. ఈ యువ సంచలనం తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్మురేపాడు.
- By Hashtag U Published Date - 05:04 PM, Thu - 17 February 22

టీమిండియా అండర్-19 కెప్టెన్ యష్ ధుల్ ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో కూడా అరంగేట్రం చేశాడు. ఈ యువ సంచలనం తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్మురేపాడు. గౌహతి వేదికగా తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన యశ్ ధూల్ 150 బంతుల్లో 18ఫోర్లతో 113 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరసన అరుదైన రికార్డ్‌లో యశ్ ధూల్ చోటు సంపాదించుకున్నాడు. వీరిద్దరూ రంజీ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టడం విశేషం.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన 136 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అతనికి కాసేపు సీనియర్ బ్యాటర్ నితీశ్ రాణా ఆ తర్వాత జాంట్ సిద్ధు తోడ్పాటు అందించారు. ఈ క్రమంలో సెంచరీ బాదిన చేసిన యశ్ ధూల్.. ఢిల్లీ స్కోరు 186 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు… ఇదిలాఉంటే..
ఐపీఎల్-2022 మెగా వేలంలో యష్ ధుల్‌ను రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అతడి కోసం మెగా వేలంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరకి ఢిల్లీ యష్ ధుల్‌ను దక్కించుకుంది. ఇటీవల భారత్ కు యష్ ధుల్ అండర్ 19 వరల్డ్ కప్ అందించారు. అంతే కాదు ఈ మెగా టోర్నీలో అతడు బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ నమోదు చేశాడు.