Private Teachers : ప్రైవేటు టీచర్లకు `సుప్రీం` గుడ్ న్యూస్
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, ఉద్యోగులకు సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రాట్యూటీ చెల్లింపు చట్టం కింద వాళ్లందరూ గ్రాట్యూటీకి అర్హులని తీర్పు చెప్పింది.
- By Hashtag U Published Date - 04:47 PM, Mon - 5 September 22

ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, ఉద్యోగులకు సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రాట్యూటీ చెల్లింపు చట్టం కింద వాళ్లందరూ గ్రాట్యూటీకి అర్హులని తీర్పు చెప్పింది. రాజీనామా లేదా పదవీ విరమణతో సహా ఏదైనా కారణం చేత సంస్థను విడిచిపెట్టడానికి ఐదు సంవత్సరాలు ఉంటే గ్రాట్యూటీ చెల్లించాల్సిందేనని ఆదేశించింది. 2009లో PAG చట్టాన్ని సవరించడం ద్వారా ఉపాధ్యాయుడిని దాని పరిధిలోకి తీసుకురావడానికి పార్లమెంట్ చట్టం చేసిందని సుప్రీం గుర్తు చేసింది. ఆ చట్టంలో ఎటువంటి లోపాలు లేవని జస్టిస్ సంజీవ్ ఖన్నా , జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. కనుక , ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ చెల్లింపులు ఉండాలని తీర్పు చెప్పింది.
Related News

Income Tax: 2023లో ఆదాయపు పన్నును ఇలా ఆదా చేసుకోండి.. మీ ప్లాన్ రెడీ చేసుకోండి
ప్రతి పన్ను చెల్లింపుదారు ఆర్థిక సంవత్సరం చివరిలో ఆదాయపు పన్ను చెల్లిస్తారు. వ్యక్తులు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రేటు వారి ఆదాయాలు, ఇతర వనరుల నుంచి సంపాదించిన లాభాలపై ఆధారపడి నిర్ణయమవుతుంది.