Mumbai Airport: రన్‌వే పై స్కిడ్ అయిన ప్రవేట్ జెట్..
ముంబై విమానాశ్రయంలో రన్‌వే 27లో ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయ్యింది
- By Sudheer Published Date - 08:45 PM, Thu - 14 September 23

ముంబై ఎయిర్ పోర్ట్ (Mumbai Airport) రన్ వే (Runway) ఫై పెను ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుండి ముంబైకి వెళ్లే ప్రైవేట్ విమానం (VT-DBL operating flight) గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో రన్‌వే 27లో ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయ్యింది. దీంతో విమానంలో మంటలు అంటుకున్నాయి. విమాన ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు (Six passengers) మరియు ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
ఈ ఆరుగురిలో ముగ్గురికి గాయాలు కావడం తో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు క్రాష్ అయిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపడుతున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపిన ప్రకటన ప్రకారం.. “ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం (Heavy Rain)తో 700 విసిబిలిటీ ఉందని” తెలిపారు. వర్షం పడుతుండడం తో విమానం స్కిడ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రమాదానికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. వీడియో చూస్తుంటే.. ఆ విమానం జారుకుంటూ పోయినట్టు అర్థం అవుతుంది. ప్రమాదంలో విమానం భారీ ఎత్తున డ్యామేజీ కనిపిస్తుంది. ముందుగా విమానం నుండి మంటలు కనిపించాయి. అయితే, వాటిని ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్పివేసింది. ఈ ప్రమాదంతో ఆ రన్ వేను కొద్ది సేపు క్లోజ్ చేశారు.
Read Also : AP : జనసేన – టీడీపీ రెండిటిని పవన్ కల్యాణే చూసుకుంటాడా..?