Posani Krishna Murali : ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ
Posani Krishna Murali : గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని నాలుగు గంటల పాటు ప్రశ్నించారు
- By Sudheer Published Date - 04:50 PM, Tue - 18 March 25

సినీ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మద్దతుదారు పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali)సీఐడీ కస్టడీ (CID Custody) ముగిసింది. ఒక రోజు కస్టడీ అనంతరం, పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో కీలకమైన ప్రశ్నలు వేసినప్పటికీ, అతని సమాధానాలపై పోలీసులు ఇంకా స్పష్టతకు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
What Is Autopen : ఏమిటీ ఆటోపెన్ ? బైడెన్ ఏం చేశారు ? నిప్పులు చెరిగిన ట్రంప్
పోసాని కృష్ణమురళిపై వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ వివాదాలు నేపథ్యంలో కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో అనేక అంశాలు పరిశీలించగా, మరింత సమాచారం అవసరమని భావిస్తున్న అధికారులు మరోసారి కస్టడీకి తరలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం చుట్టూ రాజకీయ దుమారం రేగింది. వైసీపీ వర్గాలు పోసాని అరెస్టును రాజకీయ కక్ష సాధింపు చర్యగా చూస్తుండగా, అధికార పక్షం దీనిపై మరో విధంగా స్పందిస్తున్నాయి. ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతుందా? పోసాని కృష్ణమురళిపై మరిన్ని అభియోగాలు నమోదు అవుతాయా? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. కోర్టు విచారణ ఎలా ఉంటుందన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పోసాని కృష్ణమురళి తనపై జరుగుతున్న చర్యలను తప్పుబడుతూ, తన వ్యాఖ్యల వెనుక అర్థాన్ని వక్రీకరించారని అంటున్నారు. అయితే, ఈ వివాదానికి ముగింపు ఎప్పుడు వస్తుందన్నది చూడాలి.