Hyderabad: తాజ్ హోటల్ కస్టమర్లను తనిఖీ చేసే దమ్ముందా?
హైదరాబాద్ పోలీసులు పలు రెస్టారెంట్స్, హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. ప్రజలలో బాధ్యతాయుత భావన కలిగించేందుకు హైదరాబాద్ పోలీసులు రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు.
- By Praveen Aluthuru Published Date - 11:15 AM, Mon - 18 September 23

Hyderabad: హైదరాబాద్ పోలీసులు పలు రెస్టారెంట్స్, హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. ప్రజలలో బాధ్యతాయుత భావన కలిగించేందుకు హైదరాబాద్ పోలీసులు రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. అయితే పోలీసుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ పోలీసుల ప్రవర్తనని తప్పుబడుతున్నారు.
హైదరాబాద్‌లోని కింగ్ ఖాజా హోటల్, లక్కీ హోటల్, నఫీస్ కేఫ్, మషల్లా హోటల్, మీనా కేఫ్, సిద్ధిఖీ హోటల్ మరియు యా సయ్యద్ హోటల్ వంటి రెస్టారెంట్‌లలో పోలీసు అధికారులు కస్టమర్లను తనిఖీ చేశారు. కస్టమర్‌లు ఏవైనా ఆయుధాలు లేదా గంజాయిని సరఫరా చేస్తున్నారనే అనుమానంతో తనిఖీలు చేసినట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే పోలీసుల తీరుపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని ఇలా తనిఖీ చేయడానికి నగర పోలీసులకు అనుమతి ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు తాజ్ హోటల్స్ కి వెళ్ళి అక్కడకు వచ్చిన కస్టమర్స్ ని ఇలానే చెక్ చేస్తారా? మీకు అంత దమ్ము ధైర్యం ఉందా? సామాన్యులు అనే కదా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ ప్రజలు నిలదీస్తున్నారు.
Also Read: Tomato – 50 Paisa : 50 పైసలకు కిలో టమాటా.. రైతుల లబోదిబో.. సామాన్యుల సంతోషం