HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pm Modi Is Mighty Impressed With Japanese Ambassador

PM Modi: నరేంద్ర మోడీని ఆకట్టుకున్న జపాన్ రాయబారి ట్వీట్.. ట్వీట్ లో ఏముందో తెలుసా?

జపాన్‌ రాయబారి హిరోషి సుజుకి దంపతులు భారత దేశ రుచులను ఆస్వాదిస్తున్న తీరు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆకర్షించింది. ప్రధాని నియోజకవర్గమైన వ

  • Author : Anshu Date : 11-06-2023 - 8:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Modi
Pm Modi

జపాన్‌ రాయబారి హిరోషి సుజుకి దంపతులు భారత దేశ రుచులను ఆస్వాదిస్తున్న తీరు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆకర్షించింది. ప్రధాని నియోజకవర్గమైన వారణాసిలో గత నెల హిరోషి దంపతులు బనారసీ చాట్‌, తాలి ఆరగించిన చిత్రాలను ట్విటర్‌ లో షేర్ చేశారు. ఈ సారి హిరోషి దంపతులు ముంబైలో వడాపావ్‌ ను రుచి చూశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆ దంపతులు స్ట్రీట్‌ఫుడ్‌ అన్వేషణలో భాగంగా కొల్హాపురి వంటకాలను రుచి చూశారు. ఇవి కొంచె కారం ఎక్కువగానే ఉంటాయి. కానీ, హిరోషి సతీమణి ఇవేవీ పట్టించుకోకుండా ఆ రుచులను ఎంతో బాగా ఆస్వాదించారు.

ఆ ఫుడ్ ని తింటున్నా వీడియోని హిరోషి తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఈ విధంగా క్యాప్షన్ ని కూడా రాసుకోచ్చారు. నా భార్య నన్ను ఓడించింది అని ఆయన క్యాప్షన్‌ జోడించారు. ఆ వీడియోలో ఆయన పుణేలో కొల్హాపురి రుచులను వారు రుచిచూస్తున్నారు. హిరోషి కొంచె తక్కువ కారం కోరుకుంటే ఆయన సతీమణి మాత్రం కొల్హాపురి రేంజిలో స్పైసీగా ఉండాలని డిమాండ్‌ చేశారు. వారు మిసల్‌పావ్‌, సబుదాన అనగా సగ్గుబియ్యం వడలను రుచి చూశారు. వారు కయానీ బేకరీ, ఇరానీ కేఫ్‌ వంటి ప్రముఖ ఆహార శాలలను సైతం సందర్శించారు.

 

This is one contest you may not mind losing, Mr. Ambassador. Good to see you enjoying India’s culinary diversity and also presenting it in such an innovative manner. Keep the videos coming! https://t.co/TSwXqH1BYJ

— Narendra Modi (@narendramodi) June 11, 2023

అయితే వారు చేసిన ట్వీట్ ప్రధానిని బాగా ఆకర్షించింది. వీడియో పై ప్రధాని స్పందిస్తూ.. మిస్టర్‌ అంబాసిడర్‌. మీరు ఓడిపోయినా పట్టించుకోని పోటీ ఇది. మీరు భారత్‌లోని ఆహార వైవిధ్యాన్ని ఆస్వాదించడం.. దానిని వినూత్నంగా ప్రజెంట్‌ చేయడం చూడటానికి చాలా బాగుంది. వీడియోస్‌ను కొనసాగించండి అని రాసుకొచ్చారు నరేంద్ర మోడీ.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • japanese ambassador
  • pm modi
  • tweet viral
  • video viral

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd