France Highest Award To PM Modi : ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం.. ఏడేళ్లలో అందుకున్న 14 పురస్కారాలివే
France Highest Award To PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అత్యున్నత పురస్కారం దక్కింది..
- By Pasha Published Date - 07:11 AM, Fri - 14 July 23

France Highest Award To PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అత్యున్నత పురస్కారం దక్కింది..
ఫ్రాన్స్ పర్యటన కోసం గురువారం మధ్యాహ్నం ప్యారిస్ కు చేరుకున్న మోడీకి.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ప్యారిస్ లోని ఎలీసీ ప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్” (Grand Cross of the Legion of Honour)తో నరేంద్ర మోడీని సత్కరించారు.
ఇది ఫ్రాన్స్ దేశానికి చెందిన సైనిక లేదా పౌర పురస్కారాల్లో అత్యున్నతమైనది..
దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోడీ గుర్తింపు పొందారు.
ఈవిధంగా గౌరవించినందుకు భారత ప్రజల తరఫున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం అనంతరం ప్రధాని మోడీకి మాక్రాన్ ప్రైవేట్ విందు ఇచ్చారు.
గతంలో ఈ పురస్కారాన్ని(France Highest Award To PM Modi) అందుకున్న ప్రముఖుల్లో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్ (అప్పటి వేల్స్ యువరాజు), మాజీ జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బౌట్రోస్ ఘలీ తదితరులు ఉన్నారు.
Also read : Tirumala Temple: భరతనాట్యం చేస్తూ తిరుమలకు చేరుకున్న యువకుడు.. 75 నిమిషాల్లోనే కొండపైకి..!
ప్రధాని మోడీ అందుకున్న పురస్కారాల జాబితా..
- 2023 జూన్ లో ఈజిప్ట్ దేశం ప్రధాని మోడీకి “ఆర్డర్ ఆఫ్ ది నైల్” పురస్కారం అందించింది.
- 2023 మే లో పాపువా న్యూ గినియా దేశం ప్రధాని మోడీకి “కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు” పురస్కారం అందించింది.
- 2023 మేలో ఫిజీ దేశం ప్రధాని మోడీకి “కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ” పురస్కారం అందించింది.
- 2023 మేలో రిపబ్లిక్ ఆఫ్ పలావ్ దేశం “ఎబకల్” అవార్డు ను ప్రధాని మోడీకి ప్రదానం చేసింది.
- “ఆర్డర్ ఆఫ్ ది డ్రుక్ గ్యాల్పో” అవార్డును 2021లో భూటాన్ దేశం ప్రధాని మోడీకి అందించింది.
- 2020లో అమెరికా ప్రభుత్వం “లెజియన్ ఆఫ్ మెరిట్” అవార్డును ప్రధాని మోడీకి అందించింది.
- 2019లో బహ్రెయిన్ దేశం “కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్” అవార్డును ప్రధాని మోడీకి అందించింది.
- 2019లో మాల్దీవుల దేశం “ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్” ను ప్రధాని మోడీకి అందించింది.
- 2019లోనే రష్యా దేశం “ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ” అవార్డును ప్రధాని మోడీకి అందించింది.
- 2019లో UAE దేశం “ఆర్డర్ ఆఫ్ జాయెద్” అవార్డును ప్రధాని మోడీకి అందించింది.
- 2018లో పాలస్తీనా దేశం “గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా” అవార్డును ప్రధాని మోడీకి అందించింది.
- 2016లో ఆఫ్ఘనిస్తాన్ దేశం “స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్” అవార్డును ప్రధాని మోడీకి అందించింది.
- 2016లో సౌదీ అరేబియా దేశం “ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్” ను ప్రధాని మోడీకి అందించింది.