Tabebuia Rosea : హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటున్న ‘పింక్ ఫ్లవర్’ చెట్లు
Tabebuia Rosea : GHMC చేపట్టిన ఈ చర్య నగరాన్ని మరింత పర్యావరణ హితంగా మార్చడంలో మంచి ఉదాహరణగా నిలుస్తోంది
- By Sudheer Published Date - 04:44 PM, Tue - 18 March 25

వేసవి కాలం (Summer Season) ప్రారంభమైతే చాలు హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గులాబి రంగు పూలతో కళకళలాడుతుంది. ఎండాకాలంలో సాధారణంగా చెట్ల ఆకులు రాలిపోతాయి. కానీ జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, బంజారాహిల్స్ వంటి ప్రదేశాల్లో కనిపించే ‘టబేబుయా రోజియా’ (Tabebuia Rosea) చెట్లు మాత్రం విభిన్నంగా ఉంటాయి. ఈ చెట్లు ఆకర్షణీయమైన గులాబీ పూలను వికసిస్తూ నగరానికి ప్రత్యేకమైన అందాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన చెట్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నగరాన్ని మరింత హరితంగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు నాటింది.
Sunita Williams: సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడానికి 9 నెలలు ఎందుకు పట్టింది?
టబేబుయా రోజియా చెట్లు సహజంగా దక్షిణ అమెరికా దేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ చెట్లు ఎక్కువగా వేసవి కాలంలో ఆకులు వేయడంతో పాటు అందమైన పూలను పూస్తాయి. వీటి గులాబీ రంగు పూలు మారుతున్న హైదరాబాదీ పర్యావరణానికి సొబగులు అద్దుతూ, నగర వాసులకు విదేశీ అనుభూతిని కలిగిస్తున్నాయి. వీటి తేలికపాటి పరిమళం, మృదువైన ఆకృతి వీటిని మరింత ప్రత్యేకంగా నిలిపేస్తుంది. దీంతో ఈ ప్రాంతాలను సందర్శించే ప్రజలు ఫోటోలు తీసుకుంటూ, ఈ అందాన్ని ఆస్వాదిస్తున్నారు.
Junaid Khan: తీవ్ర విషాదం.. ఎండ కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ మృతి
నగరంలోని ప్రముఖ వీధులు, పార్కులు ఈ చెట్లతో మరింత అందంగా మారాయి. ఈ చెట్ల వల్ల ఎటువంటి కాలుష్యం లేకుండా వాతావరణం హరితంగా మారడంతో పాటు పక్షులు, తేనెటీగలు కూడా ఆకర్షితమవుతున్నాయి. GHMC చేపట్టిన ఈ చర్య నగరాన్ని మరింత పర్యావరణ హితంగా మార్చడంలో మంచి ఉదాహరణగా నిలుస్తోంది. ఇదే తరహాలో మరిన్ని హరిత ప్రణాళికలను అమలు చేయడం వల్ల నగరం మరింత సుందరంగా మారుతుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.