Leaf Insect: ఇది ఆకు కాదు.. పురుగు !!
అబ్బుర పరిచే ప్రకృతి అందాలు, పక్షులు, జంతువుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే విషయంలో ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫ్ఎస్) పర్వీన్ కస్వాన్ ఫేమస్.
- By Hashtag U Published Date - 10:09 PM, Wed - 1 June 22

అబ్బుర పరిచే ప్రకృతి అందాలు, పక్షులు, జంతువుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే విషయంలో ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫ్ఎస్) పర్వీన్ కస్వాన్ ఫేమస్. ఇటీవల ఆయన ఒక ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దాన్ని చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. చూడటానికి.. చెట్టు నుంచి రాలిపడిన ఆకులా ఉన్న పురుగు ఫోటో అది. అచ్చం ఆకులా ఉన్న ఆ కీటకాన్ని ఎన్నడూ చూడలేదని కామెంట్స్ పెడుతున్నారు. “ఇది పురుగు అంటే.. నమ్మలేకపోతున్నా” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
“మనుషులకు 2 కళ్ళున్నా.. ఈ పురుగును గుర్తు పట్టాలంటే .. రెండు కళ్ళతో రెండు రెండుసార్లు చూడాల్సిందే” అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఈ ఫోటో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. దానికి ఇప్పటికే 4 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.
Camouflage level. Infinity. A leaf insect. pic.twitter.com/sCgOdSdodO
— Parveen Kaswan (@ParveenKaswan) June 1, 2022