Team India Players: పంత్ త్వరగా కోలుకోవాలి.. టీంఇండియా పూజలు!
భారత క్రికెట్ జట్టు స్టాఫ్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు.
- Author : Balu J
Date : 23-01-2023 - 2:23 IST
Published By : Hashtagu Telugu Desk
న్యూజిలాండ్‌తో మూడో వన్డే నిమిత్తం టీమ్‌ఇండియా జట్టు మధ్యప్రదేశ్ చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున సూర్యకుమార్, కుల్‌దీప్, సుందర్‌తో పాటు భారత క్రికెట్ జట్టు ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. పరమశివుడికి భస్మా హారతి సమర్పించారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ.. రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని మేం ఆ భగవంతుడిని ప్రార్థించాం. అతడు జట్టులోకి తిరిగిరావడం టీమ్‌ఇండియాకు చాలా ముఖ్యం అని తెలిపాడు.