HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Over 2600 Flights Cancelled Due To Thunderstorms In Us

US: అమెరికాలో పిడుగుల దెబ్బకు 2600 విమానాలు రద్దు?

ప్రస్తుతం అమెరికాలో పిడుగులతో కూడిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా నీటమునిగాయి. ఈ పిడుగులతో కూడిన వర్షాల కారణంగా

  • Author : Anshu Date : 17-07-2023 - 4:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Us
Us

ప్రస్తుతం అమెరికాలో పిడుగులతో కూడిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా నీటమునిగాయి. ఈ పిడుగులతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటే భయపడుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా పది,ఇరవై కాదండోయ్ దాదాపుగా 2,600 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో పాటు మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఈశ్యాన్య ప్రాంతంలో ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఈశాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దు కాగా వాటిల్లో 350 న్యూజెర్సీ లోని న్యూఆర్క్‌ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉన్నాయి.

దీంతోపాటు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఎయిర్‌ పోర్ట్‌, లా గార్డియన్‌ ఎయిర్‌ పోర్టుల్లో పలు సర్వీసులు రద్దు చేశారు. జేఎఫ్‌కే విమానాశ్రయంలో 318 రద్దు కాగా 426 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక లా గార్డియన్‌లో 270 సర్వీసులు రద్దుకాగా 292 ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. చాలా విమానయాన సంస్థలు అడ్వైజరీలను ట్విటర్‌లో పోస్టు చేశాయి. ప్రయాణికులు ఎయిర్‌ పోర్టుకు బయల్దేరే ముందు మరోసారి విమాన సమయాలను, వాతావరణ పరిస్థితులను చెక్‌ చేసుకోవాలని సూచించాయి. ఈశాన్య అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో పలు చోట్ల వరదలు సంభవిస్తున్నాయి.

న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెటికట్‌, పెన్సిల్వేనియా, మాస్సాచుసెట్స్‌, వెర్మాంట్‌ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ పేర్కొంది. ఇక కనెటికట్‌, మస్సాచుసెట్స్‌, న్యూహాంప్‌షైర్‌, న్యూయార్క్‌, రోడే దీవిలో టోర్నడో వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. మరోవైపు అమెరికాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వార్తలొస్తున్నాయి. ఆదివారం కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలో ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశాల్లో డెత్‌వ్యాలీ కూడా ఒకటి. కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌దాకా శక్తిమంతమైన వేడి గాలులు వీస్తున్నాయని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. సాధారణంకంటే 10 నుంచి 20 డిగ్రీల ఫారన్‌హీట్‌ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆరిజోనా రాష్ట్రంలో పగటి సమయం అధికంగా ఉంటోంది. రాజధాని ఫీనిక్స్‌లో వరుసగా 16 రోజులపాటు 109 డిగ్రీల ఫారన్‌హీట్‌ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2600flights cancle
  • Flights
  • thunderstorms
  • us

Related News

Trump- PM Modi

యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ!

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. హోర్ముజ్ మార్గం మూతపడితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా.

  • Pakistan

    పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

Latest News

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

  • ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

  • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

  • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd