Richest Barber: ఒకప్పుడు తినడానికి కనీసం తిండి లేదు.. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్
ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.
- By Nakshatra Published Date - 10:46 PM, Tue - 11 April 23
Richest Barber: ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించలేం. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిన వారు, ఒక్క రాత్రిలో ఫేమస్ అయినవారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి స్టోరీ కూడా అలాంటిదే.
ఒకప్పుడు తినడాకే తిండి లేని ఈ వ్యక్తికి ఇప్పుడు 600 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇతడి స్టోరీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. బెంగళూరుకు చెందిన రమేష్ బాబు తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. దీంతో తల్లి అతడిని పెంచింది. 10వ తరగతిలోనే చదువు మానేసిన రమేష్ తన తండ్రి స్టార్ట్ చేసిన ఇన్నర్ స్పేస్ షాపులో బార్బర్ గా పనిచేశాడు. ఆ తర్వాత దానిని ట్రెండీ స్ట్రైలింగ్ అవుట్ లెట్‌గా మార్చేశాడు. దీంతో హెయిర్స్టాయిలిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక 1993లో తన మామ దగ్గర ఒక మారుతీ ఓమ్నీ వ్యాన్‌ను రమేష్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ట్రావెల్స్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇక అది బాగా సాగడంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో కార్ రెంటర్ అండ్ సెల్ప్ డ్రైవింగ్ సేవలను ప్రారంభించాడు. లగ్జరీ కార్లను రెంట్ కు ఇస్తూ ఉంటారు. 30 ఏళ్లుగా ఎన్నో కొత్త కార్లను ఈయన కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 600కుపైగా కార్లు అతని కారు గ్యారేజీలో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత కాస్ట్ లీ కార్లన్నీ ఆయన కారు గ్యారేజీలో ఉన్నాయి.
రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్, జాగ్వార్, బీఎండబ్ల్యూ లాంటి కార్లు అన్నీ ఉన్నాయి. ఇక వ్యాన్లు, మినీ బస్సులు కూడా రమేష్‌కు ఉన్నాయి. బెంగళూరుతో పాటు చెన్నై, ఢిల్లీలలో ఆయన ట్రావెల్స్ కంపెనీ విస్తరించింది. దాదాపు 300కుపైగా ఆయన కంపెనీలో ఉపాధి పొందుతున్నారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ వంటి సెలబ్రెటీలు ఆయన కస్లమర్లుగా ఉన్నారు. అలాగే సెలబ్రెటీలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఆయన కార్లను అద్దెకు తీసుకుంటారు. రోజుకు అద్దె రూ.50 వేలకుపైగా ఉంటుందట. 2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ తో ప్రపంచలోనే అత్యంత సంపద కలిగిన బార్చర్ గా రమేష్ ను గతంలో ఫోర్బ్స్ గుర్తించింది.