Custodial Death: ఒడిశా పోలీసుల కస్టడీలో వ్యక్తి మృతి.. పోలీసుల వేధింపులే కారణమా..?
ఒడిశాలోని భువనేశ్వర్‌లో పోలీస్ కస్టడీలో ఓ వక్తి చనిపోయిన ఘటన కలకలం రేపుతుంది. తన భర్త కుంటుతూనే ఉన్నా ఆరోగ్యంగా ఉన్నాడని అతడి భార్య చెప్పింది.
- By Hashtag U Published Date - 09:43 AM, Tue - 19 April 22

ఒడిశాలోని భువనేశ్వర్‌లో పోలీస్ కస్టడీలో ఓ వక్తి చనిపోయిన ఘటన కలకలం రేపుతుంది. తన భర్త కుంటుతూనే ఉన్నా ఆరోగ్యంగా ఉన్నాడని అతడి భార్య చెప్పింది. తన భర్త పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసల కారణంగా చనిపోయాడని… అతనికి ఎలాంటి దొంగతనం కేసులో ప్రమేయం లేదని ఆమె ఆరోపించింది. తన భర్త ఆదివారం రాత్రి రసూల్‌ఘర్‌లోని తన అత్తమామ ఇంటి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, సైకిల్ దొంగిలించాడనే ఆరోపణతో బడగడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపింది.
పోలీసు రికార్డులో అతని పేరు ప్రదీప్ సాహు అని, అతని కుటుంబ సభ్యులు దేబేంద్ర చౌదరి అని పేర్కొనడంతో వ్యక్తి గుర్తింపు గురించి గందరగోళం నెలకొంది. పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పట్టుకుని బడగడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లామని.. అక్కడ అతను అనారోగ్యంతో ఉన్నాడని ఫిర్యాదు చేసి క్యాపిటల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.
భువనేశ్వర్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ యుఎస్ దాష్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన తరువాత మరణించిన వ్యక్తి తన పేరు ప్రదీప్ సాహు అని..అతనిపై దొంగతనం కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఘటన పోలీసు కస్టడీలో జరిగినందున, ఎన్‌హెచ్‌ఆర్‌సి మార్గదర్శకాల ప్రకారం మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహానికి సంబంధించిన విచారణ జరుగుతోందన్నారు. పోలీసులు తెల్లవారుజామున 1.30 గంటలకు తమ నివాసానికి వచ్చారని, క్యాపిటల్ హాస్పిటల్‌లోని పోలీసు అవుట్‌పోస్ట్‌కు చేరుకోవాలని తనను కోరారని వ్యక్తి భార్య తెలిపింది. దీంతో ఆమె భర్త మృతి చెందినట్లు పోలీసులు ఆమెకు సమాచారం అందించారు. కానీ వారు అతని మృతదేహాన్ని చూడటానికి తనని అనుమతించలేదని ఆమె చెప్పింది. మరో మహిళ ఆస్పత్రి వద్దకు వచ్చి చనిపోయిన వ్యక్తి తన భర్తేనని, మృతదేహాన్ని అప్పగించాలని చెప్పడంతో వివాదం నెలకొంది.