NTR Off To Dubai : దుబాయ్ వెళ్లిన జూ.ఎన్టీఆర్..ఈ సమయంలో వెళ్తావా అంటూ ట్రోల్స్
మూడు రోజులుగా ప్రతి ఒక్కరు చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందిస్తున్నారు కానీ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు
- By Sudheer Published Date - 03:53 PM, Thu - 14 September 23

జూ. ఎన్టీఆర్ (NTR) దుబాయ్ (Dubai) కి వెళ్లారనే వార్తలుతెలిసి యావత్ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఎక్కడ చూసిన చంద్రబాబు అరెస్ట్ గురించే అంత మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ తప్పుడు కేసులో చంద్రబాబు ను అరెస్ట్ (Chandrababu Arrest) చేయడం ఫై అన్ని రాజకీయ పార్టీలు , సినీ ప్రముఖులు , పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంఘీభావం తెలుస్తూ..వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఇంత నడుస్తున్న జూ ఎన్టీఆర్ ఈ అరెస్ట్ ను ఖండించడం కానీ..లోకేష్ కు ధైర్యం చెప్పడం కానీ కుటుంబ సభ్యులను ఓదార్చడం కానీ చేయలేదు. దీంతో టీడీపీ శ్రేణులతో పాటు అభిమానులు సైతం ఎన్టీఆర్ తీరు ఫై మండిపడుతున్నారు.
ఇక ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లారని తెలిసి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర (Devara) మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో షూటింగ్ ను పక్కన పెట్టి ఎన్టీఆర్ దుబాయ్ కి వెళ్లడం వెనుక చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందించడం లేదని అడగడమే అని తెలుస్తుంది. మూడు రోజులుగా ప్రతి ఒక్కరు చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందిస్తున్నారు కానీ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు ప్రశ్నింస్తుండడంతో అవన్నీ తట్టుకోలేకనే ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లాడని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ సడెన్ గా దుబాయ్ కి వెళ్లడం వెనుక అసలు కారణం నేటి అనేది తెలియాల్సి ఉంది.
Read Also : AP : రాజకీయ కక్ష్యతోనే చంద్రబాబును అరెస్ట్ చేసారు – బండి సంజయ్