The Elephant Whisperers : ది ఎలిఫెంట్ విస్పరర్స్ దర్శక, నిర్మాతలకు నోటీసులు
ఆస్కార్ అవార్డు పొందిన 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీ నిర్మాత దర్శకులకు అందులో నటించిన బొమ్మన్, బెల్లీ
- By Prasad Published Date - 07:52 AM, Thu - 10 August 23

ఆస్కార్ అవార్డు పొందిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నిర్మాత దర్శకులకు అందులో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతులు నోటీసులు పంపారు.. నిర్మాత, దర్శకులు తమకు ఇల్లు, స్థలం, నగదు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని ఆ నోటీసులో పేర్కొన్నారు. ముదుమలై పులుల అభయారణ్యంలో గున్న ఏనుగు లను సంరక్షిస్తున్న బొమ్మన్, బెల్లీ దంపతులపై దర్శ కురాలు కార్తికి గోంజాల్వెస్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ తీశారు. ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డునూ గెలుచుకుంది డాక్యుమెంటరీ నిర్మాత, దర్శకులు తమకు ఇల్లు, స్థలం ఇచ్చి నగదు సాయం చేస్తామని మోస గించారని బొమ్మన్, బెల్లీ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త ప్రవీణ్రా జ్ విషయం తెలుసుకొని వారిని న్యాయవాదితో మాట్లాడించి నోటీసులు పంపారు.