Heavy Rain In Noida : నోయిడాలో భారీ వర్షం.. పాఠశాలలకు సెలవులు
వర్షాల కారణంగా నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 8వ...
- By Prasad Published Date - 07:26 AM, Fri - 23 September 22

వర్షాల కారణంగా నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 8వ తరగతి వరకు శుక్రవారం సెలవులు ప్రకటించాయి. పాఠశాలలను మూసివేస్తూ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్ యత్రాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 23 న, జిల్లాలోని 1 నుండి 8వ తరగతి వరకు అన్ని పాఠశాలలు మూసివేయబడతాయని జిల్లా స్కూల్ ఇన్‌స్పెక్టర్ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు. గత రెండు రోజులుగా గౌతమ్ బుద్ధ నగర్‌తో సహా ఉత్తరప్రదేశ్, జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో భారీ వర్షాలు కురిశాయి. అయితే వరదలు కారణంగా పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. నగరంలో వరుసగా రెండో రోజు కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నీటమునిగిన వీధులు, భారీ ట్రాఫిక్ జామ్ కనిపించింది. భారీ వర్షాలు నేపథ్యంలో శుక్రవారం అన్ని కార్పొరేట్ కార్యాలయాలను ఇంటి నుండి పని చేయాలని గురుగ్రామ్ పరిపాలన ఆదేశించింది.