Noida Fire: నోయిడాలో ఓ అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం
గ్రేటర్ నోయిడాలో ఓ అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడాలోని గౌర్ సిటీ14 అవెన్యూలో బుధవారం ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు
- Author : Praveen Aluthuru
Date : 26-04-2023 - 1:44 IST
Published By : Hashtagu Telugu Desk
Noida Fire: గ్రేటర్ నోయిడాలో ఓ అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడాలోని గౌర్ సిటీ14 అవెన్యూలో బుధవారం ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ లో మంటలు చెలరేగడం గమనించిన సొసైటీ వాసులు బిల్డర్ కు మరియు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సొసైటీలోని ఎల్ టవర్‌లోని ఫ్లాట్ నంబర్ 2097లో అగ్నిప్రమాదం జరిగినట్లు సొసైటీ ప్రజలు తెలిపారు. అయితే సదరు ఫ్లాట్ ఓనర్ ఎవరో ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగినప్పుడు ఫ్లాట్ కు తాళం వేసి ఉన్నట్లు అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు.
ग्रेटर नोएडा: गौर सिटी 14 एवेन्यू में लगी भीषण आग, दमकल की कई गाड़ियां मौके पर@JagranNews #Noida #fire pic.twitter.com/BFr8MheNSL
— Abhishek Tiwari (@abhishe_tiwary) April 26, 2023
ప్రమాదం జరిగినప్పుడు ఫ్లాట్ లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయినప్పటికీ మంటలను ఆర్పేందుకు అపార్ట్మెంట్ వాసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఫ్లాట్ కు తాళం వేసి ఉండటంతో బిల్డర్ మేనేజ్‌మెంట్ సొసైటీలో అమర్చిన అగ్నిమాపక పరికరాల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫ్లాట్‌లోని బాల్కనీలో మంటలు చెలరేగినట్లు సొసైటీ ప్రజలు తెలిపారు. క్రమంగా ఫ్లాట్‌లోకి మంటలు వ్యాపించడంతో ఫ్లాట్‌లోని లక్షల రూపాయల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.
Read More: Inter Student: మరికొన్ని గంటల్లో ఫలితాలు.. ఇంటర్ విద్యార్థి సూసైడ్